బెంగళూరు: మైక్రోసాఫ్ట్ చాట్‌జీపీటీ అందుబాటులోకి వచ్చాక ఇంటర్నెట్కు ఈ ఫీవరే పట్టుకొన్నది. సాధారణ సమస్యలే కాదు.. జీవిత సమస్యలకూ ఓ పరిష్కారం ఉన్నదని చెప్తూ భగవద్గీత జీపీటీని అందుబాటులోకి తీసుకొచ్చాడో బెంగళూరు సాఫ్ట్వేర్ ఇంజినీర్.
గూగుల్‌లో పనిచేస్తున్న సాయి వినీత్ ఈ ఆవిష్కరణ చేశాడు. దీనికి మీ జీవిత సమస్యను చెప్తే సరి.. భగవద్గీత రెఫరెన్స్‌తో సమాధానాన్ని వెతుకుతుంది. భగవద్గీత నుంచి శ్లోకాలను అన్వయించి, మంచి ఉపదేశాన్ని అందిస్తుంది.