దేశంలో విరుచుకుపడనున్న థర్డ్‌వేవ్: ఎయిమ్స్ చీఫ్
AIIMS chief on covid third wave: భారత్‌లో థర్డ్‌వేవ్ వ్యాపించడం అనివార్యమని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా అభిప్రాయపడ్డారు.

న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నది. మొదటి వేవ్‌తో పోల్చితే రెండో వేవ్ తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో భారత్‌లో థర్డ్‌వేవ్ వ్యాపించడం అనివార్యమని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా అభిప్రాయపడ్డారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 6 నుంచి 8 వారాల్లో కొవిడ్ మూడో వేవ్ విరుచుకుపడే అవకాశం ఉందని చెప్పారు. అన్‌లాక్ కారణంగా ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించడం లేదని, దాంతో వైరస్ రూపాంతరం చెందుతూ ఉంటుందని ఆయన తెలిపారు.
కొవిడ్ హాట్స్పాట్లలో తగిన నిఘా ఉంచడం అవసరమని చెప్పారు. దేశంలో ఉన్న జనాభాకు టీకాలు అందించడం, కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోస్‌కు, డోస్‌కు మధ్య అంతరం తగ్గించడం సవాల్‌గా మారిందని ఆయన పేర్కొన్నారు. కరోనా మొదటి, రెండో వేవ్‌ల నుంచి ఏం నేర్చుకున్నామో గుర్తు చేసుకోవాలన్నారు. కానీ, పలు రాష్ట్రాలు అన్‌లాక్ చేయడంతో జనం కనీస కొవిడ్ నిబంధనలు కూడా పాటించడం లేదని వాపోయారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మళ్లీ పాజిటివ్ కేసులు పెరుగడం ఖాయమని డాక్టర్ రణ్‌దీప్ గులేరియా హెచ్చరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Magnesium Supplements | మెగ్నిషియం సప్లిమెంట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి.. అవి ఎలా పనిచేస్తాయి..?
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

