Venkaiah Naidu : ప్రజాకేంద్రిత కృత్రిమమేధ వినియోగం పెరగాలి: వెంకయ్యనాయుడు
Venkaiah Naidu : కృత్రిమ మేధ వంటి విప్లవాత్మక సాంకేతిక సంస్కరణల సామర్థ్యం ద్వారా కలిగే లాభాలను ప్రజలకు అందించి వారి జీవితాల నాణ్యతను పెంచాల్సిన అవసరం ఉన్నదని...

జోధ్‌పూర్ : (Venkaiah Naidu) కృత్రిమ మేధ వంటి విప్లవాత్మక సాంకేతిక సంస్కరణల సామర్థ్యం ద్వారా కలిగే లాభాలను ప్రజలకు అందించి వారి జీవితాల నాణ్యతను పెంచాల్సిన అవసరం ఉన్నదని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఈ దిశగా విద్య, వైద్యం, వ్యవసాయం తదితర రంగాల్లో సానుకూల మార్పులు తీసుకొచ్చేందుకు ప్రజాకేంద్రిత కృత్రిమమేధ వినియోగాన్ని పెంచేందుకు విశ్వవిద్యాలయాలు, పరిశోధన కేంద్రాలు, శాస్త్రవేత్తలు ముందుకు రావాలని సూచించారు. మంగళవారం రాజస్థాన్ జోధ్‌పూర్ ఐఐటీలోని జోధ్‌పూర్ సిటీ నాలెడ్జ్ అండ్ ఇన్నొవేషన్ సెంటర్‌ను ఉపరాష్ట్రపతి సందర్శించారు. అనంతరం ఫ్యాబ్రికేషన్ లాబొరేటరీ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ థింగ్స్ (ఏఐఓటీ) కేంద్రానికి శంకుస్థాపన చేశారు.
కృత్రిమమేధ, ఏఐఓటీ కారణంగా గత దశాబ్దంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని.. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నదని వెంకయ్యనాయుడు సూచించారు. ప్రజలు దోపిడీకి గురికాకుండా సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేసేందుకు విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు చొరవతీసుకోవాలని చెప్పారు. యువత సేవాభావాన్ని అలవర్చుకోవాలని, రాజకీయాల్లోకి రావాలని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి సూచించారు. యువశక్తికి సిద్ధాంతం, కాలుష్యం కాని ఆలోచనలు తోడైతే భారత రాజకీయాల్లో గణనీయమైన మార్పులు సాధ్యమని, ఈ దిశగా యువత ఆలోచించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా, రాజస్థాన్ రాష్ట్ర మంత్రి బీడీ కల్లా, రాజ్యసభ సభ్యుడు రాజేంద్ర గెహ్లాట్, ఐఐటీ జోధ్‌పూర్ డైరెక్టర్ ప్రొఫెసర్ శంతను చౌదరి, డిప్యూటీ డైరెక్టర్ ప్రొఫెసర్ సంపత్ రాజ్ వదేరా, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
కల్రాజ్ మిశ్రా పుస్తకావిష్కరణ
మంగళవారం సాయంత్రం జరిగిన మరో కార్యక్రమంలో రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా రాసిన ‘సంవిధాన్, సంస్కృతి, ఔర్ రాష్ట్ర్’ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. చిన్నారుల్లో బాల్యం నుంచే జాతీయవాద భావన పెంపొందించాలని సూచించారు. గవర్నర్ హోదాలో రాజస్థాన్‌లో కల్రాజ్ మిశ్రా చేస్తున్న సేవలను అభినందించారు.
ఇవి కూడా చదవండి..
పాకిస్తాన్లో గరిష్టస్థాయికి నిరుద్యోగం
మైగ్రేన్‌తో బాధపడుతున్నారా? ఈ ఆహారాలను దూరం పెట్టండి!
హోం మంత్రి అనిల్ విజ్‌కు అస్వస్థత.. ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిక
కృత్రిమ కాఫీ.. ఇక కాఫీ తోటలతో పనిలేదు!
మరో 3 రోజుల్లో దుబాయ్ ఎక్స్పో
విజృంభిస్తున్న డెంగ్యూ డీ2 వేరియింట్.. అరికట్టండిలా!
క్రీడలతో పిల్లల్లో డిప్రెషన్‌కు చెక్.. మాంట్రియల్ పరిశోధన
ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్‌పై మరోసారి దాడి
అనుకోకుండా ఆవిష్కృతమైన యాంటీబయోటిక్స్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

