న్యూఢిల్లీ: ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసులో కెనడా పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు నిందితులకు పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఇంగ్లిష్ మీడియా కథనాలు వెల్లడించాయి.
‘కెనడాలో భారత్కు వ్యతిరేకంగా, ఖలిస్థానీ అనుకూల కార్యకలాపాలు సాగించే వాళ్లకు పాక్ ఐఎస్ఐ నుంచి నిధులు అందుతున్నాయి. తాజా కేసులో అరెస్టు అయిన ముగ్గురు డ్రగ్స్ దందా చేస్తున్నారని, వారికి ఐఎస్ఐతో సంబంధాలున్నాయని మాకు తెలిసింది’ అని సదరు వర్గాలు తెలిపాయి.