చంద్రయాన్-3 విజయవంతం కావడంతో 73 రోజులుగా తాము పడ్డ కష్టానికి తగ్గ ఫలితం వచ్చిందని శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. చంద్రయాన్-3 విజయవంతంగా నిర్ణీత కక్ష్యలోకి చేరుకోవడంతో తమ తపస్సు ఫలించిందని మిషన్ డైరెక్టర్ మోహన కుమార్ తెలిపారు.
మానవ సహిత యాత్ర గగన్‌యాన్‌కు ఎల్వీఎం-3 రాకెట్ వినియోగిస్తున్నందున దాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. ఎల్వీఎం రాకెట్‌తో ఇప్పటివరకు ఏడు ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించినట్టు విక్రమ్ సారాబాయి స్పేస్ సెంటర్ డైరెక్టర్ ఉన్నికృష్ణన్ వెల్లడించారు.