న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వైద్యులకు ప్రత్యేక గుర్తింపు సంఖ్యను ఇవ్వాలని జాతీయ మెడికల్ కమిషన్ నిర్ణయించింది. కొత్త నిబంధన ప్రకారం, ప్రతి వైద్యుడు జాతీయ మెడికల్ రిజిస్టర్లో నమోదు కావాల్సి ఉంటుంది.
ఇందులో వైద్యుల డిగ్రీ, యునివర్సిటీ, స్పెషాలిటీ వంటి కీలక సమాచారాన్ని పొందుపరుస్తారు. ఈ సమాచారాన్ని జాతీయ మెడికల్ కమిషన్ వెబ్సైట్లో పొందుపరుస్తారు. జాతీయ మెడికల్ కమిషన్కు చెందిన ఎథిక్స్ అండ్ మెడికల్ రిజిస్ట్రేషన్ బోర్డు నుంచి లైసెన్సు పొందాల్సి ఉంటుంది.