కార్బన్ డేటింగ్ కచ్చితమేనా?
ఉత్తరప్రదేశ్ వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో బయటపడిన ఓ నిర్మాణం శివలింగమని హిందూ సంఘాలు.. కాదు, ఫౌంటెన్ అని ఆ మసీదు నిర్వహణ కమిటీ వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ నిర్మాణం వయస్సును నిర్ధారించేందుకు కార్బన్ డేటింగ్ నిర్వహించాలన్న ప్రతిపాదనలు వచ్చాయి.
- పురాతన నిర్మాణాల వయస్సు నిర్ధారణలో కీలకం
వారణాసి, మే 20: ఉత్తరప్రదేశ్ వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో బయటపడిన ఓ నిర్మాణం శివలింగమని హిందూ సంఘాలు.. కాదు, ఫౌంటెన్ అని ఆ మసీదు నిర్వహణ కమిటీ వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ నిర్మాణం వయస్సును నిర్ధారించేందుకు కార్బన్ డేటింగ్ నిర్వహించాలన్న ప్రతిపాదనలు వచ్చాయి. కార్బన్ డేటింగ్ ద్వారా పురాతన నిర్మాణాల వయస్సును కచ్చితంగా నిర్ధారించవచ్చా అనే అంశం ఇప్పుడు చర్చకు దారితీసింది.
40-50 వేల ఏండ్ల క్రితం నాటి ఆర్గానిక్ పదార్థాలు కలిగిన పురాతన వస్తువులు లేదా నిర్మాణాల వయస్సును కార్బన్ డేటింగ్ ద్వారా నిర్ధారిస్తారు. ఆ వస్తువుల్లోని రేడియో కార్బన్ శాతం, సి-14 అణువుల ఆధారంగా వయస్సు లెక్కిస్తారు. సంబంధిత నిర్మాణంలోని కొంతభాగాన్ని వేరుచేసి పరీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. అలా కాని పక్షంలో ప్రత్యామ్నాయ పరీక్షలు చేయాలి. కార్బన్ డేటింగ్ ద్వారా వయస్సును కచ్చితంగా నిర్ధారించలేకపోయినా, దగ్గరగా అంచనా వేయవచ్చు. ఈ పరీక్ష ద్వారా పురాతన నిర్మాణాల వయస్సును వంద సంవత్సరాలు అటు ఇటుగా లెక్కించవచ్చని పురావస్తు శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

