న్యూఢిల్లీ, జూన్ 22: బ్రెజిల్‌లోని దక్షిణ ప్రాంతంలో శాస్త్రవేత్తలు 29 కోట్ల ఏండ్ల నాటి అడవి అవశేషాలను గుర్తించారు. మొత్తం 164 చెట్ల కాండాలను కనుగొన్నారు.
ఫెడెరల్ యూనివర్సిటీ పరానా, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, ఫెడెరల్ యూనివర్సిటీ ఆఫ్ రియోగ్రాండే పరిశోధకులు సంయుక్తంగా ఈ పరిశోధనలు నిర్వహించారు. మొక్కల పరిణామ క్రమంపై మరింత స్పష్టమైన, విస్తృతమైన అధ్యయానికి ఇవి దోహదపడతాయని భావిస్తున్నారు.