Farmers Protest | మరోసారి ఢిల్లీ ర్యాలీకి సిద్ధమైన రైతు సంఘాలు
దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Farmers Protest | చండీగఢ్/చత్రపతి శంభాజీనగర్, జూలై 16: దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైతుల ‘ఢిల్లీ చలో’ సందర్భంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో హర్యానాలో అంబాలా సమీపంలోని శంభు సరిహద్దు వద్ద జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన బారికేడ్లు, ఇతర దిగ్బంధనాలను తొలగించిన తర్వాత.. మరోసారి ఢిల్లీకి ర్యాలీ చేపట్టేందుకు రైతు సంఘాలు సిద్ధమయ్యాయి. శంభు సరిహద్దు వద్ద జాతీయ రహదారిని తెరిచిన వెంటనే రైతులు మళ్లీ చలో ఢిల్లీ చేపడుతారని భారతీయ కిసాన్ యూనియన్ ఏక్తా సిద్ధూపూర్, సంయుక్త కిసాన్ మోర్చా(నాన్ పొలిటికల్) నేత జగ్జిత్ సింగ్ దల్లేవాల్ మంగళవారం వెల్లడించారు.
పంటలకు కనీస మద్దతు ధర, ఇతర డిమాండ్ల పరిష్కారం అయ్యేంత వరకు రైతాంగ ఉద్యయం ఆగేది లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రయాణికుల అసౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని శంభు సరిహద్దు వద్ద రహదారిపై ఏర్పాటు చేసిన బారికేడ్లను వారం రోజుల్లో తొలగించాలని పంజాబ్-హర్యానా హైకోర్టు ఇటీవల హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో దల్లేవాల్ ఈ మేరకు ప్రకటన చేశారు. ఫిబ్రవరిలో ఎస్కేఎం(నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా(కేఎంఎం) ఆధ్వర్యంలో రైతులు చేపట్టిన ‘ఢిల్లీ చలో’ను పోలీసులు పంజాబ్-హర్యానాలోని శంభు సరిహద్దు వద్ద అడ్డుకోవడంతో ఆ నెల 13 నుంచి రైతులు అక్కడే బైఠాయించి ఆందోళనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.
జంతర్‌మంతర్ లేదా రామ్‌లీలా మైదానంలో..
ర్యాలీగా ఢిల్లీ చేరిన తర్వాత జంతర్‌మంతర్ లేదా రామ్‌లీలా మైదానంలో శాంతియుత ఆందోళనలు కొనసాగిస్తామని జగ్జిత్ సింగ్ దల్లేవాల్ వెల్లడించారు. బారికేడ్ల తర్వాత తాము కొనసాగించే ర్యాలీని మళ్లీ అడ్డుకొన్నా, రోడ్డును దిగ్బంధించినా ప్రభుత్వానిదే బాధ్యత అని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ ఏడాది మార్చిలో ఆందోళనల సందర్భంగా పోలీసులు అరెస్టు చేసిన నవదీప్ సింగ్‌కు సంఘీభావంగా బుధ, గురువారాల్లో శాంతియుత ఆందోళనలు చేపడుతామని తెలిపారు. నవదీప్ సింగ్‌పై పోలీసులు అల్లర్లు, హత్యాయత్నం వంటి తీవ్రమైన అభియోగాలు మోపారు. హైకోర్టు ఆదేశాలను హర్యానా ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయడంపై దల్లేవాల్ స్పందిస్తూ.. రోడ్డును బ్లాక్ చేసింది ప్రభుత్వమేనని, రైతులు కాదని అన్నారు. ఫిబ్రవరిలో రైతులు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణల్లో మరణించిన రైతు శుభకరణ్ సింగ్ మృతిపై దర్యాప్తునకు ఏర్పాటు చేసిన కమిటీపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు.
ఎంఎస్పీ పెంచక ఇబ్బందుల్లో చక్కెర పరిశ్రమ
కేంద్ర ప్రభుత్వం గత ఐదేండ్లుగా మద్దతు ధరను పెంచకపోవడంతో దేశంలోని చక్కెర పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నదని షుగర్ యూనిట్స్ ఫెడరేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ లిమిటెడ్ డైరెక్టర్ జైప్రకాశ్ దండేగోంకర్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కేంద్రం త్వరితగతిన నిర్ణయాలు తీసుకోకపోవడంతో షుగర్ ఇండస్ట్రీలో వర్కింగ్ క్యాపిటల్‌లో స్వల్ప మార్జిన్లు, అప్పులు వంటి సమస్యలు మళ్లీ తలెత్తే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం చెరకు ఎఫ్ఆర్పీని మూడుసార్లు పెంచిందని, అయితే చక్కెరకు ఎంఎస్పీని పెంచలేదని పేర్కొన్నారు. గత ఐదేండ్లుగా అన్ని రాష్ర్టాల ఫెడరేషన్లు డిమాండ్ చేస్తున్నా, ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన లేదని విమర్శించారు. చెరకు, రవాణా, లేబర్ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో చక్కెర ఉత్పత్తి ఖర్చుగా కేజీకి కనీసం రూ.41 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
100 రోజులు ఏపీలోఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో ఎత్తింది 65 టీఎంసీలు!
పంటలను ఎండబెడుతున్న కాంగ్రెస్.. కరెంటు, నీళ్లు ఇవ్వడం చేతగాని రేవంత్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

