ముంబై: భారత్లోని సంపన్న, ఎగువ మధ్యతరగతి వర్గాలలో నాలుగింట మూడొంతుల మంది తమ పిల్లలను విద్యాభ్యాసం కోసం విదేశాలకు పంపుతున్నారని ఓ సర్వే నివేదిక వెల్లడించింది. కోటి రూపాయల నుంచి రూ.17 కోట్ల మధ్య పెట్టుబడి మిగులు ఉన్న 1,456 మంది సంపన్నులను ‘గ్లోబల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ 2024’ సంస్థ గత మార్చి నెలలో సర్వే చేసింది. వీరిలో 78 శాతం మంది తమ పిల్లలను చదువుకోసం విదేశాలకు పంపేందుకు ఆసక్తి కనబరిచారు.
వీరిలో ఎక్కువమంది తమ పిల్లలను ప్రాధాన్య క్రమంలో అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్ దేశాలకు పంపేందుకు ఇష్టపడుతున్నట్టు వెల్లడించింది. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను విదేశాలకు పంపేందుకు ఆర్థిక ఇబ్బందులను సైతం ఎదుర్కొనేందుకు సిద్ధపడుతున్నారని తెలిపింది. చాలామంది ఉద్యోగ విరమణ తరువాత బతకడం కోసం దాచుకున్న డబ్బును సైతం తమ పిల్లల చదువుకోసం వెచ్చిస్తున్నారని పేర్కొంది.