మైక్రోసాఫ్ట్‌తో సమన్వయం.. ఇబ్బందులు రానివ్వం
మైక్రోసాఫ్ట్ విండోస్‌లో తలెత్తిన సాంకేతిక లోపంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సమస్య ఉత్పన్నం కాగానే ప్రభుత్వం మైక్రోసాఫ్ట్ కంపెనీతో టచ్‌లోకి వెళ్లిందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.
- ఎన్ఐసీ ప్రభావితం కాలేదు.. – కేంద్ర ఐటీ మంత్రి వైష్ణవ్
న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్ విండోస్‌లో తలెత్తిన సాంకేతిక లోపంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సమస్య ఉత్పన్నం కాగానే ప్రభుత్వం మైక్రోసాఫ్ట్ కంపెనీతో టచ్‌లోకి వెళ్లిందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. ఈ ఎర్రర్ కారణంగా నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్(ఎన్ఐసీ) నెట్వర్క్ ప్రభావితం కాలేదని పేర్కొన్నారు.
ఎన్ఐసీకి చెందిన ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ(ఐసీటీ) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కమ్యూనికేషన్ సేవలు అందిస్తుంది. మైక్రోసాఫ్ట్‌లో సాంకేతిక సమస్య నేపథ్యంలో ఇండియన్ కంప్యూటర్ రెస్పాన్స్ టీమ్(సీఈఆర్టీ) ఒక అడ్వైజరీ జారీ చేసిందని మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
ప్రయాణికులకు ఇబ్బంది రానివ్వొద్దని ఆదేశించాం
మైక్రోసాఫ్ట్ సాంకేతిక లోపం నేపథ్యంలో విమాన ప్రయాణికుల కోసం కేంద్ర పౌర విమానయాన శాఖ గైడ్ లైన్స్ జారీ చేసింది. ఎయిర్‌పోర్టుల్లో వేచి చూస్తున్న వాళ్లకు ఆహారం, మంచినీళ్లు, ఇతర సదుపాయాలు అందించాలని, విమాన సర్వీసుల సమాచారం అందజేయాలని ఆదేశించినట్టు విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. పరిస్థితిని మంత్రిత్వ శాఖ, ఏఏఐ నిశితంగా పరిశీలిస్తున్నదని, త్వరిత పరిష్కారం కోసం మైక్రోసాఫ్ట్‌తో సమన్వయం చేసుకొంటున్నట్టు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Priya Bhavani Shankar | త్వరలో పెళ్లిపీటలెక్కనున్న ఇరుముడి హీరోయిన్ .. అబ్బాయి మరెవరో కాదు..!
యువ హాకీ క్రీడాకారుడు గణేష్‌కు ఆర్థిక ప్రోత్సాహం
Varanasi | వారణాసి తెలుగు థియేట్రికల్ రైట్స్‌కు రికార్డు ధర.. రూ.290 కోట్లకు కొనుగోలు చేసిన మైత్రి మూవీ మేకర్స్!
Belly Fat | పొత్తి కడుపు కింది భాగంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించే సులభమైన వ్యాయామాలు.. ఇంట్లోనే చేయవచ్చు..
Niranjan reddy | ప్రభుత్వ ఖర్చుతో బర్త్ డే వేడుకలు.. రేవంత్ రెడ్డి ఒక్కడే ఉంటారేమో : నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

