న్యూఢిల్లీ: వస్త్ర ధారణలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి. పరిశోధకులు సౌర శక్తితో నడిచే దుస్తులను అభివృద్ధిపరిచారు. ఫ్లెక్సిబుల్ సోలార్ సెల్స్, ఎలక్ట్రానిక్ డివైస్‌ను ఉపయోగించి ఈ వస్ర్తాలను రూపొందించారు. ఈ బట్టలను ధరించినవారి శరీరం వాతావరణంలోని ఉష్ణోగ్రతల్లో మార్పులను తట్టుకోగలుగుతుంది.
వాతావరణంలో ఉష్ణోగ్రత 12.5 డిగ్రీల నుంచి 37.6 డిగ్రీల మధ్యలో ఉన్నపుడు ఈ స్మార్ట్ దుస్తులను ధరించినవారు 32-36 డిగ్రీల థర్మల్ జోన్లో ఉన్నట్లుగా అనుభూతి చెంది, హాయిగా ఉండగలుగుతారు. ఈ వస్ర్తాలను 12 గంటలపాటు సూర్య కాంతిలో ఛార్జింగ్ చేస్తే, 24 గంటలపాటు ధరించవచ్చు. ఈ పరిశోధన వివరాలను ‘సైన్స్’ జర్నల్ ప్రచురించింది.