Home
National
The Aam Aadmi Party Has Strongly Accused The Bjp At The Center Of Playing Tricks On Delhi Cm Kejriwals Health
కేజ్రీవాల్ ప్రాణాలతో బీజేపీ చెలగాటం
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోగ్యంతో కేంద్రంలోని బీజేపీ చెలగాటం ఆడుతున్నదని ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ఆరోపించింది.
- ఆయన షుగర్ లెవెల్స్ పడిపోయాయని ఆప్ ఆరోపణ
న్యూఢిల్లీ, జూలై 13: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోగ్యంతో కేంద్రంలోని బీజేపీ చెలగాటం ఆడుతున్నదని ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ఆరోపించింది. మార్చి నుంచి తీహార్ జైలులో ఉంచిన కేజ్రీవాల్ బ్లడ్ షుగర్ లెవెల్స్ 50 ఎంజీ/డీఎల్ కన్నా తక్కువకు ఐదుసార్లు పడిపోయాయని, ఆయన బరువు సుమారు 8.5 కేజీలు తగ్గిందని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ తెలిపారు.
కేజ్రీవాల్‌కు నిర్బంధం నుంచి విముక్తి కల్పించి సరైన చికిత్స అందించకపోతే ఆయన ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు ఆయన ఆరోగ్యంపై తీవ్రంగా కలత చెందుతున్నారని, ఆయన ఎందుకు బరువు తగ్గిపోతున్నారో కారణాలు తెలియడం లేదన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

