Snapchat | తండ్రి స్నాప్‌చాట్ వద్దన్నాడని..16 ఏళ్ల బాలిక సూసైడ్
Snapchat | ప్రముఖ మెసేజింగ్ యాప్ స్నాన్చాట్ను వాడొద్దని తండ్రి మందలించినందుకు 16 ఏళ్ల బాలిక బలవన్మరణానికి పాల్పడింది.
Snapchat | ఇటీవలే కాలంలో యువత చిన్న చిన్న విషయాలకే కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనో.. తాము చేస్తున్న పనులకు ఇంట్లో వాళ్లు అడ్డుచెప్పారన్న కారణాలతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా మహారాష్ట్ర (Maharashtra) థానే (Thane)లోనూ ఇలాంటి తరహా ఘటనే చోటు చేసుకుంది.
ప్రముఖ మెసేజింగ్ యాప్ స్నాన్చాట్ను వాడొద్దని తండ్రి మందలించినందుకు 16 ఏళ్ల బాలిక బలవన్మరణానికి పాల్పడింది. థానే జిల్లాలోని డోంబివిలీ ప్రాంతంలోని శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. 16 ఏళ్ల బాలిక తన ఫోన్ (mobile phone)లో స్నాప్‌చాట్ (Snapchat) అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకుంది. ఇది చూసిన బాలిక తండ్రి ఆమెను సున్నితంగా మందలించాడు. స్నాప్‌చాట్‌ను వాడొద్దని సూచించాడు. తండ్రి మాటలకు ఆగ్రహానికి గురైన సదరు బాలిక క్షణికావేశంలో కఠిన నిర్ణయం తీసుకుంది. రాత్రి తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని (hangs self) బలవన్మరణానికి పాల్పడింది.
ఉదయం గది తలుపులు తెరవకపోడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు డోర్లు బద్దలు కొట్టి చూడగా.. అప్పటికే బాలిక ఫ్యాన్‌కు విగతజీవిగా వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న మాన్పాడ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ప్రమాదవశాత్తు మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read..
Lok Sabha | లోక్‌సభ సమావేశాలు ప్రారంభం.. ఎంపీగా ప్రమాణం చేసిన మోదీ
PM Modi | మూడో దఫాలో మూడు రెట్లు అధికంగా పనిచేస్తాం : ప్రధాని మోదీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

