పొరపాటున కోవిషీల్డ్‌కు బదులు యాంటీ రేబీస్ టీకా.. నర్స్ సస్పెన్షన్.. ఎక్కడంటే?!
కోవిషీల్డ్‌కు బదులు యాంటీ రేబీస్ టీకా | ఠాణె హెల్త్ సెంటర్లో నర్స్ ఓ వ్యక్తికి పొరపాటున యాంటీ రేబీస్ టీకా వేశారు.

ఠాణె: మహారాష్ట్రలోని ఠాణె మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హెల్త్ సెంటర్లో ఓ పొరపాటు చోటు చేసుకుంది. కోవిడ్ వ్యాక్సిన్ కోసం వచ్చిన ఓ వ్యక్తికి సదరు హెల్త్ సెంటర్లో పని చేస్తున్న నర్స్ పొరపాటు యాంటీ రేబీస్ వ్యాక్సిన్ (ఏఆర్వీ) ఇచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనపై స్పందించిన ఠాణె మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సదరు నర్స్ కీర్తి పోపరేను సస్పెండ్ చేస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.
సోమవారం కల్వాలోని అత్కోనేశ్వర్ హెల్త్ సెంటర్‌కు రాజ్‌కుమార్ యాదవ్ అనే వ్యక్తి కొవిషీల్డ్ వ్యాక్సిన్ కోసం వచ్చారు. అయితే, ఆయన ఏఆర్వీ వ్యాక్సినేషన్ చేస్తున్న క్యూలో నిలుచున్నాడు. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న నర్స్ కీర్తి పోపరే.. సదరు వ్యక్తి కేస్ పేపర్ చూడకుండానే వ్యాక్సిన్ ఇచ్చేశారు.
ఈ సమాచారం తెలియడంతో సదరు రాజ్‌కుమార్ యాదవ్‌ను దవాఖానలో అబ్జర్వేషన్లో ఉంచారు. సంబంధిత పేషంట్ కేస్ పేపర్ చూడటం నర్స్ డ్యూటీ అని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చెప్పారు. ఆమె నిర్లక్ష్యం వల్ల సదరు వ్యక్తికి ప్రాణాపాయం ఏర్పడిందన్న ఆరోపణను కార్పొరేషన్ అధికారులు నిరాకరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accidents | పండుగ పూట హైదరాబాద్‌లో వరుస అగ్ని ప్రమాదాలు..! భయాందోళనలో జనం : వీడియో
Ramayana | ‘రామాయణ’ కంటే ‘ఆదిపురుష్’ విజువల్స్ బెటరా.. గ్రాఫిక్స్ విషయంలో ప్రభాస్ సినిమాకే ఎక్కువ మార్కులు!
MLA Murali Naik | దీపావళి వేడుకల్లో ఎమ్మెల్యే మురళీ నాయక్ చేదు అనుభవం : వీడియో
Virosh | జపాన్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దీపావళి వేడుకలు.. విదేశీ గడ్డపై సంప్రదాయ హోమం!
Police Misconduct | పోలీసుల దారిదోపిడీ..! కానిస్టేబుల్,హోంగార్డుపై కేసు.. కానిస్టేబుల్ పరారీ
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

