E Chip based Passports | తెలంగాణలో త్వరలో.. ఎలక్ట్రానిక్ చిప్ ఆధారిత పాస్‌పోర్టులు
E Chip based Passports | తెలంగాణ పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు శుభవార్త. త్వరలోనే ఎలక్ట్రానిక్ చిప్ ఆధారిత పాస్‌పోర్టులతో విమానాల్లో ప్రయాణించవచ్చు. హైదరాబాద్‌లో ‘ఈ-చిప్ పాస్‌పోర్ట్’ జారీని ప్రారంభించేందుకు తెలంగాణ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం (ఆర్పీవో) ఏర్పాట్లు చేస్తున్నది.
హైదరాబాద్: తెలంగాణ పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు శుభవార్త. త్వరలోనే ఎలక్ట్రానిక్ చిప్ ఆధారిత పాస్‌పోర్టులతో విమానాల్లో ప్రయాణించవచ్చు. (E Chip based Passports) విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) సూచనలతో హైదరాబాద్‌లో ‘ఈ-చిప్ పాస్‌పోర్ట్’ జారీని ప్రారంభించేందుకు తెలంగాణ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం (ఆర్పీవో) అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నది. 12 నగరాల్లో చేపట్టనున్న పైలట్ ప్రాజెక్ట్‌లో హైదరాబాద్‌ను కూడా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎంచుకున్నది. చెన్నై, నాగ్‌పూర్, భువనేశ్వర్, జమ్ము, గోవా, సిమ్లా, రాయ్‌పూర్, అమృత్సర్, జైపూర్, సూరత్, రాంచీలో కూడా ‘ఈ-చిప్ పాస్‌పోర్ట్’ జారీని ప్రారంభించనున్నారు.
కాగా, కొత్త ఈ-చిప్ ఆధారిత పాస్‌పోర్ట్ ప్రస్తుత పాస్‌పోర్ట్‌ను పోలి ఉంటుంది. అయితే అత్యంత అధునాతన భద్రతా వ్యవస్థతో కూడిన చిప్‌ను కలిగి ఉంటుంది. దరఖాస్తుదారుడి పూర్తి వివరాలు ఈ చిప్‌లో నిక్షిత్తమై ఉంటాయి. బయోమెట్రిక్ డేటా, డిజిటల్ సైన్‌తో సహా పలు ప్రత్యేకతలు ఇందులో ఉంటాయి. దీంతో ఎయిర్‌పోర్టుల్లో సులువుగా ప్రయాణికుడి వివరాలు తెలుసుకోవచ్చు. దేశంతోపాటు విదేశాల్లోని అన్ని రాయబార కార్యాలయాలు ఈ-పాస్‌పోర్ట్ ప్రాజెక్టుతో అనుసంధానమవుతాయి. అమెరికా, బ్రిటన్‌లోని భారత రాయబార కార్యాలయాల్లో ఇది ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది.
మరోవైపు నాసిక్‌లోని ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్‌లో ఈ-పాస్‌పోర్ట్‌ను తయారు చేసి ముద్రిస్తారు. ఆర్ఎఫ్ఐడీ చిప్, యాంటెన్నా కవర్లో నిక్షిత్తమై ఉంటాయి. బంగారు రంగు చిహ్నం కింద ఎలక్ట్రానిక్ పాస్ట్పోర్ట్గా పేర్కొంటారు. ఈ-చిప్ పాస్‌పోర్ట్‌ను ట్యాంపరింగ్ చేయడానికి వీలులేదు. ఎవరైనా చిప్‌ను ట్యాంపరింగ్ చేయడానికి ప్రయత్నిస్తే పాస్‌పోర్ట్ సేవా వ్యవస్థకు హెచ్చరిక అందుతుంది. దీంతో పాస్‌పోర్ట్ దుర్వినియోగాన్ని అడ్డుకోవచ్చు.
కాగా, సాధారణ పాస్‌పోర్ట్ జారీకి వారం నుంచి పది రోజులు పడుతుంది. అయితే కొత్త ఈ-చిప్ పాస్‌పోర్ట్ కేవలం ఏడు రోజుల్లో జారీ అవుతుంది. ఇప్పటికే ఉన్న పాస్‌పోర్ట్‌లు కూడా కొనసాగుతాయని ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం అధికారులు తెలిపారు. కొత్త ఈ-చిప్ పాస్‌పోర్ట్ జారీ తర్వాత ఆటోమేటిక్‌గా పాత పాస్‌పోర్ట్ రద్దవుతుందని చెప్పారు.
మరోవైపు దరఖాస్తుదారులు www.passportindia.gov.in ఆన్లైన్ పోర్టల్ ద్వారా లాగిన్ లేదా సమీపంలోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రం లేదా పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో అపాయింట్మెంట్ ద్వారా ఈ-పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సాధారణ, తత్కాల్‌తో సహా సుమారు 5,000 పాస్‌పోర్ట్ దరఖాస్తులను తెలంగాణ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం ప్రాసెస్ చేస్తుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

