haircut | హెయిర్ కట్ నచ్చనందుకు.. బిల్డింగ్ పైనుంచి దూకి బాలుడు సూసైడ్
haircut | 13 ఏళ్ల బాలుడికి కుటుంబ సభ్యులు హెయిర్ కట్ (haircut ) చేయించారు. అయితే జుట్టు చాలా చిన్నగా కత్తిరించడంపై అతడు ఆగ్రహించాడు. అపార్ట్మెంట్ బిల్డింగ్ 16వ అంతస్తులోని బాత్రూమ్ కిటికీ నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
ముంబై: హెయిర్ కట్ (haircut ) నచ్చకపోవడంపై ఆగ్రహించిన ఒక బాలుడు బిల్డింగ్ పైనుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు. మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఈ సంఘటన జరిగింది. భయాందర్ నగరానికి చెందిన 13 ఏళ్ల బాలుడికి కుటుంబ సభ్యులు హెయిర్ కట్ చేయించారు. అయితే జుట్టు చాలా చిన్నగా కత్తిరించడంపై అతడు ఆగ్రహించాడు. అపార్ట్మెంట్ బిల్డింగ్ 16వ అంతస్తులోని బాత్రూమ్ కిటికీ నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తీవ్రంగా గాయపడిన ఆ బాలుడు అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న నవఘర్ పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. బాలుడి మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, హెయిర్ కట్ నచ్చకపోవడం వల్ల బాలుడు ఆగ్రహంతో అపార్ట్మెంట్ బాత్రూమ్ కిటికీ నుంచి కిందకు దూకి సూసైడ్ చేసుకున్న సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ విషయం తెలుసుకున్న అపార్ట్మెంట్ వాసులు, స్థానికులు షాక్ అయ్యారు. టీనేజ్ పిల్లల తొందరపాటు నిర్ణయాలు తల్లిదండ్రులను మానసిక క్షోభకు గురి చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read:
Newborn Abandoned | బిడ్డను ప్రసవించి.. బాత్రూమ్లోని బకెట్లో వదిలేసిన మహిళ
Chicken Curry | చికెన్ కర్రీ కోసం గొడవ.. కోపంలో కొడుకు తల పగలగొట్టిన తండ్రి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

