పాట్నా: కాలేజీలో పరీక్షల నేపథ్యంలో టీచర్లు, విద్యార్థులు కొట్టుకున్నారు. (Teachers, Students Exchange Blows) ఈ దాడిలో కొందరు విద్యార్థులు, ఒక స్టూడెంట్ తల్లి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో విద్యార్థులు ఆగ్రహించారు. కాలేజీ ప్రిన్సిపాల్, టీచర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీహార్‌లోని బెగుసరాయ్‌లో ఈ సంఘటన జరిగింది. ఎంఆర్జేడీ కాలేజీలో జరుగుతున్న పరీక్షలకు కొందరు విద్యార్థులు హాజరయ్యారు. సోదరుడి బదులు ఒక మహిళ బీఏ పార్ట్ 2 ఎగ్జామ్ రాసింది. టీచర్ వద్దకు వెళ్లి సంతకం చేయాలని అడిగింది. దీని గురించి వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన ఆ టీచర్ ఆ తోబుట్టువులను కొట్టాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఎగ్జామ్ హాల్ వద్దకు రాగా వారిని కూడా టీచర్లు కొట్టారు.
కాగా, ఆ కుటుంబంపై టీచర్లు దాడి చేయడంపై విద్యార్థులు ఆగ్రహంతో రగిలిపోయారు. వారు ప్రతిఘటించారు. ఈ నేపథ్యంలో టీచర్లు, విద్యార్థులు కొట్టుకున్నారు. ఈ దాడిలో విద్యార్థులైన అభిషేక్ కుమార్, జనక్ నందనీ కుమారి, నిధి భారతి గాయపడ్డారు. అభిషేక్ తల్లి లక్ష్మీదేవి, సోదరుడు కరణ్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు ఈ సంఘటనపై విద్యార్థులు ఆగ్రహంతో రగిలిపోయారు. ఆ కాలేజీ వద్ద నిరసన చేపట్టారు. ప్రిన్సిపాల్, టీచర్లపై చర్యలు తీసుకోవాలని స్టూడెంట్స్ డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కాలేజీ వద్దకు చేరుకున్నారు. అలాగే హాస్పిటల్‌కు వెళ్లి బాధిత విద్యార్థుల స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, కాలేజీ టీచర్లు, విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
एम.आर.जे.डी महाविद्यालय परिसर में जी.डी कालेज के छात्र वो छात्रा के साथ कॉलेज कर्मचारी के द्वारा लात-मुक्का से बुरी तरह पीटा गया ।
इस पूरी घटना का निष्पक्ष जांच कर दोषियों पर विधि सम्मत कार्रवाई कर दण्ड दिलवायें नहीं तो हम आंदोलन के लिए बाध्य होंगें @DM_Begusarai @lnmuniversity pic.twitter.com/w1LFmJ65lF— Abhishek Ujjwal Singh 🇮🇳 (@aabhishekujjwal) October 24, 2024
@GovernorBihar
Respected sir
Please close mrjd college Begusarai with immediate effect .This is inside college campus of m.r.j.d college where a girl and her family brutally torcher by principal and his son and bouncer.
I am the eyewitness of same crime happened in past. pic.twitter.com/fn17aOzyAY— kaushik shubham pandey( मोदी का परिवार) (@hit_shubham) October 24, 2024