టీచర్లుగా కొనసాగాలంటే టెట్ తప్పనిసరి.. ఐదేండ్ల్లకు మించి సర్వీసుంటే టెట్ పాస్ అవ్వాల్సిందే : సుప్రీం
ఉద్యోగంలో కొనసాగేందుకు లేదా పాఠశాలల్లో పదోన్నతి కోరేందుకు టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్టు(టెట్)లో ఉత్తీర్ణులు కావడం ఉపాధ్యాయులకు తప్పనిసరని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. దేశంలోని పాఠశాలల్లో విద్యార్హతలు గల టీచర్ల ఆవశ్యకతను జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జి మాసిహ్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తన తీర్పులో ప్రస్తావించింది.
- వద్దని అనుకుంటే రాజీనామా చేసి వెళ్లిపోవాలి
- ఐదేండ్లలోపు సర్వీసు ఉన్న వారికి మినహాయింపు
- మైనారిటీ స్కూళ్ల అంశం విస్తృత ధర్మాసనానికి
- సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు
న్యూఢిల్లీ/హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగంలో కొనసాగేందుకు లేదా పాఠశాలల్లో పదోన్నతి కోరేందుకు టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్టు(టెట్)లో ఉత్తీర్ణులు కావడం ఉపాధ్యాయులకు తప్పనిసరని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. దేశంలోని పాఠశాలల్లో విద్యార్హతలు గల టీచర్ల ఆవశ్యకతను జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జి మాసిహ్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తన తీర్పులో ప్రస్తావించింది. పదవీ విరమణకు ముందు ఐదేళ్లకు పైగా సర్వీసు మిగిలి ఉన్న టీచర్లు సర్వీసులో కొనసాగాలంటే తప్పనిసరిగా టెట్ పాస్ కావలసి ఉంటుందని సుప్రీంకోర్టు ఆదేశించింది. టెట్ రాయడానికి ఇష్టపడని ఉపాధ్యాయులు లేక అర్హత సాధించలేకపోయిన ఉపాధ్యాయులు రిటైర్మెంట్ ప్రయోజనాలతో రాజీనామా చేయాలని లేదా కంపల్సరీ రిటైర్మెంట్ తీసుకోవాలని తెలిపింది. అయితే పదవీ విరమణకు ముందు ఐదేళ్ల లోపు సర్వీసు ఉన్న వారు మాత్రం టెట్ లేకుండానే సర్వీసులో కొనసాగడానికి ధర్మాసనం అనుమతి ఇచ్చింది. కాగా, రాష్ర్టాలలోని మైనారిటీ విద్యా సంస్థలలో పనిచేస్తున్న టీచర్లకు టెట్ అవసరమా, దాని వల్ల వారి రాజ్యాంగపరమైన హక్కులపై పర్యవసనాలు ఎలా ఉంటాయి అన్న అంశాలను విచారించే విషయాన్ని విస్తృత ధర్మాసనానికి నివేదిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. తమిళనాడు, మహారాష్ట్రలోని పాఠశాలల్లో బోధించడానికి టెట్ అవసరమా అన్న అంశానికి సంబంధించిన పిటిషన్‌పై కోర్టు ఈ తీర్పు వెలువరించింది.
పదోన్నతులకు కూడా..
ఉపాధ్యాయుల పదోన్నతులకు కూడా టెట్ తప్పనిసరి అని కోర్టు స్పష్టంచేసింది. టెట్ లేకుండా పదోన్నతులు పొందిన వారు రెండేండ్లలోపు టెట్‌ను క్లియర్ చేయాలని తీర్పునిచ్చింది. ఈ గడువులోపు టెట్ అర్హత సాధించకపోతే ఉద్యోగాన్ని వదులుకోవాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. సుప్రీం కోర్టు తీర్పు దేశమంతటా వర్తిస్తుంది. రాష్ట్రంలో 2012 నుంచి టెట్ అమల్లో ఉంది. 2012, 2017, 2024లో రిక్రూట్ అయిన వారంతా టెట్ అర్హత గల వారే.
టెట్ అంటే ఏమిటి?
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) ఓ జాతీయ స్థాయి అర్హత పరీక్ష. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ తరగతులకు టీచర్‌గా నియామకం చెందాలంటే టెట్‌లో ఉత్తీర్ణత తప్పనిసరి. 2010లో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్(ఎన్సీటీఈ) ఈ పరీక్షను తప్పనిసరి చేసింది.
వివాదం ఏమిటి?
విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 23(1) ప్రకారం టీచర్ల విద్యార్హతలను ఎన్సీటీఈ నిర్ధారిస్తుంది. 1 నుంచి 8వ తరగతి వరకు టీచర్లుగా పనిచేయాలంటే టెట్‌లో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి చేస్తూ 2010 ఆగస్టు 23న ఎన్సీటీఈ ఓ నోటిఫికేషన్ జారీచేసింది. టీచర్లుగా నియమితులైనవారు ఐదేళ్ల లోపు టెట్‌లో ఉత్తీర్ణులు కావాలని ఎన్సీటీఈ సమయం ఇచ్చింది. అయితే తర్వాత ఈ గడువును మరో నాలుగేళ్లకు పొడిగించింది. కాగా, ఎన్సీటీఈ నోటిఫికేషన్ని సవాలు చేస్తూ కొందరు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. 2011 జూలై 29 లోపల టీచర్లుగా నియమితులైన అభ్యర్థులు సర్వీసులో కొనసాగడానికి టెట్ అవసరం లేదని మద్రాసు హైకోర్టు 2025 జూన్‌లో తీర్పు ఇచ్చింది. అయితే పదోన్నతి కోసం టెట్ పాసు కావడం తప్పనిసరని స్పష్టం చేసింది. దీనిపై దాఖలైన అప్పీలుపై సోమవారం తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు సర్వీసులో కొనసాగడంతోపాటు ప్రమోషన్ పొందేందుకు కూడా టెట్ తప్పనిసరని స్పష్టం చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

