Teacher thrashes Student | విద్యార్థిని బల్లపై పడుకోపెట్టి ప్లాస్టిక్ పైప్‌తో కొట్టిన టీచర్.. సహకరించిన ఇద్దరు విద్యార్థులు
Teacher thrashes Student |
భోపాల్: విద్యార్థి పట్ల టీచర్ దారుణంగా ప్రవర్తించాడు. ఆ విద్యార్థిని బల్లపై పడుకోబెట్టాడు. టీచర్ కాళ్లు పట్టుకోగా మరో ఇద్దరు విద్యార్థులు ఆ బాలుడి చేతులు పట్టుకున్నారు. దీంతో ఆ టీచర్ ప్లాస్టిక్ పైప్‌తో ఆ విద్యార్థిని కొట్టాడు. (Teacher thrashes Student) ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో టీచర్‌తో సహో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఈ సంఘటన జరిగింది. 13 ఏండ్ల బాలుడు 8వ తరగతి చదువుతున్నాడు. సెప్టెంబర్ 2న స్కూల్ ముగిసిన తర్వాత అతడు ట్యూషన్ సెంటర్‌కు వెళ్లాడు.
కాగా, ట్యూషన్ టీచర్ ఇచ్చిన లెక్కల హోంవర్క్ ఆ బాలుడు చేయలేదు. ఈ నేపథ్యంలో టీచర్ అభిషేక్ ఆ విద్యార్థిని బల్లపై పడుకోబెట్టాడు. టీచర్ ఆ బాలుడి కాళ్లు పట్టుకున్నాడు. మరో ఇద్దరు విద్యార్థులతో చేతులు పట్టుకోమని చెప్పాడు. దీంతో వారు అతడి చేతులు పట్టుకున్నారు. అనంతరం టీచర్ ఆ విద్యార్థిని ప్లాస్టిక్ పైప్‌తో దారుణంగా కొట్టాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడు.
మరోవైపు ఆ బాలుడు ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ట్యూషన్ సెంటర్ డైరెక్టర్ చంద్రకాంత్ మిశ్రా, కో డైరెక్టర్ ప్రేమ్ శర్మ, ట్యూషన్ టీచర్ అభిషేక్, అతడికి సహకరించిన విద్యార్థులు రాహుల్ గుర్జార్, సంకేత్ భారతిపై దాడి, జువైనల్ జస్టిస్ యాక్ట్ ఉల్లంఘన కింద కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

