Teacher terminated: విద్యార్థినికి సినిమా స్టైల్లో లవ్ ప్రపోజ్ చేసిన టీచర్.. టర్మినేట్ చేసిన అధికారులు!!
ట్రైనింగ్ సెంటర్లోనే విద్యార్థినికి ఓ టీచర్ సినిమా స్టైల్లో లవ్ ప్రపోజ్ చేశాడు. క్లాస్ మధ్యలో మోకాళ్లపై కూర్చొని విద్యార్థినికి 'ఐ లవ్యూ' చెప్పాడు. విషయం తెలుసుకున్న అధికారులు సీరియస్ అయ్యారు. అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ ఘటన అసోంలోని దేమాజీ నగరంలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్య యోజనా కేంద్రంలో జరిగింది.
ట్రైనింగ్ సెంటర్లోనే విద్యార్థినికి ఓ టీచర్ సినిమా స్టైల్లో లవ్ ప్రపోజ్ చేశాడు. క్లాస్ మధ్యలో మోకాళ్లపై కూర్చొని విద్యార్థినికి ‘ఐ లవ్యూ’ చెప్పాడు. విషయం తెలుసుకున్న అధికారులు సీరియస్ అయ్యారు. అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ ఘటన అసోంలోని దేమాజీ నగరంలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్య యోజనా కేంద్రంలో జరిగింది.
దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్య యోజనా కేంద్రంలో మనోజ్ కుంబంగ్ టీచర్ (ట్రైనర్)గా పనిచేస్తున్నాడు. క్లాసు మధ్యలో నిల్చొని ఆ సెంటర్లో ట్రైనింగ్ తీసుకుంటున్న విద్యార్థినికి సినిమాటిక్‌గా లవ్ ప్రపోజ్ చేశాడు. దీన్ని ఇతర విద్యార్థులు సెల్ఫోన్లో బంధించారు. ఈ వీడియోలు వైరల్ కావడంతో సంబంధిత అధికారులు కుంబంగ్ను విధుల్లోనుంచి తొలగించారు. సదరు విద్యార్థినిని కూడా సస్పెండ్ చేశారు. ఇది ఊహించని ఘటన అని, విషయం తమ దృష్టికి రాగానే టీచర్‌తోపాటు సదరు విద్యార్థినిపై చర్యలు తీసుకున్నామని శిక్షణా కేంద్రం బాధ్యులు తెలిపారు. ఈ ఘటనను ఫోన్లో బంధించిన వారిపై కూడా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

