Layoff | టీసీఎస్, ఇన్ఫోసిస్లోనూ ఉద్యోగాల కోతలు.. మూడు నెలల్లో 11,781 మందికి ఉద్వాసన
ఆర్థిక మాంద్యం భయాలు, వ్యయ నియంత్రణ చర్యలు వెరసి దిగ్గజ ఐటీ కంపెనీలు ఉద్యోగుల కోతను కొనసాగిస్తున్నాయి.
- టీసీఎస్‌లో 5,680, ఇన్ఫీలో 6,101 మందికి పింక్ స్లిప్
- ఆడిబుల్‌లో 5% లేఆఫ్
- అమెజాన్ కంపెనీల్లో వారంలో మూడో విడత తొలగింపులు
- సిటీ గ్రూప్‌లో రెండేండ్లలో 20 వేల మందిపై వేటు
Layoff | హైదరాబాద్, జనవరి 12 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): ఆర్థిక మాంద్యం భయాలు, వ్యయ నియంత్రణ చర్యలు వెరసి దిగ్గజ ఐటీ కంపెనీలు ఉద్యోగుల కోతను కొనసాగిస్తున్నాయి. గూగుల్, ఫ్లిప్‌కార్ట్, యూనిటీ సాఫ్ట్వేర్, పేటీఎం, అమెజాన్ తదితర ఐటీ, ఈ-కామర్స్ కంపెనీలు ఇప్పటికే వందలాది మంది ఉద్యోగులను తొలగించగా ఇప్పుడు ఆ జాబితాలోకి దేశీయ ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్ చేరాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో (అక్టోబర్-డిసెంబర్) ఈ రెండు కంపెనీలు ఏకంగా 11, 781 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్స్ ఇచ్చినట్టు పారిశ్రామికవర్గాలు తెలిపాయి. ఇందులో టీసీఎస్ 5,680 మందిపై వేటు వేయగా, ఇన్ఫీ 6,101 మందికి ఉద్వాసన పలికింది
టీసీఎస్
అక్టోబర్-డిసెంబర్ మధ్య ఉద్యోగ కోతలు: 5,680
అక్టోబర్-డిసెంబర్ మధ్య వలసల రేటు: 13.3 శాతం
డిసెంబర్ 31నాటికి సంస్థలో మిగిలిన ఉద్యోగులు: 6,03,305
ఇన్ఫోసిస్
అక్టోబర్-డిసెంబర్ మధ్య ఉద్యోగ కోతలు: 6,101
అక్టోబర్-డిసెంబర్ మధ్య వలసల రేటు: 12.9 శాతం
డిసెంబర్ 31నాటికి సంస్థలో మిగిలిన ఉద్యోగులు: 3,22,663
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

