Pollution Certificate to EV | ఎలక్ట్రిక్ వాహనానికి పొల్యూషన్ చలాన్.. సారీ చెప్పిన పోలీసులు..!
Pollution Certificate to EV | రాజస్థాన్ (Rajastan) లో ఓ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. కాలుష్యానికి ఏమాత్రం కారణంకాని ఎలక్ట్రిక్ వాహనానికి (EV) పొల్యూషన్ అండర్ కంట్రోల్ (PUC) సర్టిఫికెట్ లేదంటూ ఓ పోలీసు అధికారి చలాన్ విధించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా (Social Media) లో వైరల్ కావడంతో పోలీసుశాఖపై విమర్శలు వెల్లువెత్తాయి.
Pollution Certificate to EV : రాజస్థాన్ (Rajastan) లో ఓ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. కాలుష్యానికి ఏమాత్రం కారణంకాని ఎలక్ట్రిక్ వాహనానికి (EV) పొల్యూషన్ అండర్ కంట్రోల్ (PUC) సర్టిఫికెట్ లేదంటూ ఓ పోలీసు అధికారి చలాన్ విధించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా (Social Media) లో వైరల్ కావడంతో పోలీసుశాఖపై విమర్శలు వెల్లువెత్తాయి.
వివరాల్లోకి వెళ్తే.. నాగౌర్ జిల్లాలో ఓ అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ టాటా టియాగో ఎలక్ట్రిక్ కారును ఆపారు. కారు అద్దాలకు సన్‌షేడ్స్ ఉన్నాయని మొదట రూ.200 జరిమానా విధించారు. ఆ తర్వాత పీయూసీ సర్టిఫికెట్ చూపించమని అడగ్గా.. ఎలక్ట్రిక్ వాహనానికి అది అవసరం లేదని కారు యజమాని వాదించారు. అయినప్పటికీ అధికారి వినిపించుకోకుండా పీయూసీ లేనందుకు మరో రూ.1,500 చలాన్ విధించారు.
ఈ ఘటనపై తీవ్ర దుమారం రేగడంతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. కారు యజమానితో వాగ్వాదం జరిగిన గందరగోళంలో పొరపాటున పీయూసీ చలాన్ జారీ చేశామని అంగీకరించారు. ఈ విషయంపై విచారణ జరుపుతున్నామని, పొరపాటున వేసిన ఫైన్‌ను సిస్టం నుంచి రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. కాగా కేంద్ర మోటారు వాహన నిబంధనల ప్రకారం బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలకు పీయూసీ సర్టిఫికెట్ నుంచి పూర్తి మినహాయింపు ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

