Tamil Politics | విజయ్‌కి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశం ఇవ్వండి.. గవర్నర్‌కు డీఎంకే, వీసీకే, సీపీఐ సూచన
Tamil Politics | అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన టీవీకే పార్టీ (TVK Party) కి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశం ఇవ్వాలని, ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్ (Vijay) ని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఆహ్వానించాలని డీఎంకే (DMK), సీపీఐ (CPI), వీసీకే (VCK) పార్టీలు గవర్నర్‌కు విజ్ఞప్తి చేశాయి.
Tamil Politics : అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన టీవీకే పార్టీ (TVK Party) కి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశం ఇవ్వాలని, ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్ (Vijay) ని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఆహ్వానించాలని డీఎంకే (DMK), సీపీఐ (CPI), వీసీకే (VCK) పార్టీలు గవర్నర్‌కు విజ్ఞప్తి చేశాయి. అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకోవడానికి అవకాశం ఇవ్వాలని సూచించాయి. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ మెజారిటీ మెలికి పెడుతుండటంతో ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో జాప్యం జరుగుతోంది.
ఈ క్రమంలో వివిధ పార్టీలు స్పందించాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి విజయ్‌కి అవకాశమివ్వాలని వీసీకే గవర్నర్‌ను కోరింది. అయితే ప్రభుత్వానికి సహకరించే అవకాశంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకేకు తొలుత అవకాశమివ్వాలని డీఎంకే కూడా స్పష్టం చేసింది. గవర్నర్ రాజ్యాంగ పరిధిలో వ్యవహరించాలని సీపీఐ డిమాండ్ చేసింది. ప్రజలు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదని, కానీ 108 స్థానాలు గెలుచుకున్న టీవీకేకు మొదట అవకాశమివ్వాలని పేర్కొన్నది.
విజయ్ ఇప్పటికే రెండుసార్లు గవర్నర్‌ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలని కోరారని గుర్తుచేసింది. విజయ్ ప్రమాణ స్వీకారం చేయకముందే మెజారిటీ నిరూపించుకోవాలని గవర్నర్ ఒత్తిడి చేయడం సరికాదని అభిప్రాయపడింది. దీన్ని సీపీఐ వ్యతిరేకిస్తోందని పేర్కొన్నది. అత్యధిక స్థానాలు గెలిచిన విజయ్‌కి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశమివ్వాలని, ఆ తర్వాత సభలో మెజారిటీ నిరూపించుకోవడానికి ఛాన్స్ ఇవ్వాలని కోరింది. తమిళనాడులో ఏకైక అతిపెద్ద పార్టీగా టీవీకేను ప్రజలు ఎన్నుకున్నారని, అందువల్ల విజయ్‌కి మొదట అవకాశం ఇవ్వాలని వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్ అన్నారు.
గవర్నర్ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం గందరగోళానికి తావిస్తోందని తిరుమావళన్ అన్నారు. విజయ్‌ని ఆహ్వానించకపోవడం ఆమోదయోగ్యం కాదని చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా రాజకీయ ఒత్తిడి తెస్తున్నారేమోనని ప్రజలకు అనుమానం కలుగుతోందని తమిళనాడు యూత్ కాంగ్రెస్ మరో ప్రకటనలో పేర్కొన్నది. గవర్నర్ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, అత్యధిక మెజారిటీ ఉన్న పార్టీని ప్రభుత్వ ఏర్పాటు కోసం ఆహ్వానించాలని సూచించింది. ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకేను ఆహ్వానించకపోతే యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపడతామని, గవర్నర్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వేయిస్తంభాల గుడి సుందరీకరణకు ప్రజలు సహకరించాలి : మున్సిపల్ కమిషనర్ వెంకన్న
Speaker Sets Deadline | టీవీకేలో చేరిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణకు.. గడువు విధించిన స్పీకర్
Tiger Shroff | నేరస్థులను చూస్తే నవ్వొస్తుంది.. టైగర్ ష్రాఫ్ ఘటనపై ఆర్జీవీ రియాక్షన్
Allu Arjun | అల్లు అర్జున్ ఒక్క పోస్ట్‌తో మళ్లీ మొదలైన మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్.. రజినీకాంత్‌పై ప్రశంసలే కారణమా?
Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 125 పాయింట్లు పతనం
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

