చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధికారిక ట్విటర్ ఖాతాను ఎవరో హ్యాక్ చేశారు. దాంతో ఆయన ఖాతాను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. మాజీ సీఎం పళనిస్వామి ట్విటర్ అకౌంట్‌ను స్టాలిన్‌కు బదిలీ చేసే ప్రక్రియలో ఈ సమస్య తలెత్తినట్లు ఐటీ నిపుణులు గుర్తించారు. అయితే, ప్రస్తుతం తన వ్యక్తిగత ట్విటర్ ఖాతా ద్యారా స్టాలిన్ అధికారిక సమాచారాన్ని షేర్ చేస్తున్నారు.
తమిళనాడు ఐటీ వింగ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పేజీలలో కూడా సమస్యలు ఉన్నాయి. తమిళనాడు సీఎం అధికార ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఇంకా పళనిస్వామి ఫొటో, పేరు, ఇతర వివరాలు ఉన్నాయి. డీఎంకే ఐటీ విభాగం అధికారి మాట్లాడుతూ .. రెండు, మూడు రోజుల్లో సమస్య పరిష్కారమవుతుందన్నారు.