Taliban | తాలిబాన్ సర్కార్ మహిళలపై మరో కొత్త నిబంధన విధించింది. మహిళలు ఎక్కువ దూరం వెళ్లాలంటే మగతోడు కచ్చితంగా ఉండాల్సిందేనని ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే తలపై హిజాబ్ లేకుండా మహిళలు ప్రయాణించవద్దని, హిజాబ్ లేకుంటే పురుషులు కూడా ప్రయాణానికి ఒప్పుకోవద్దని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ”72 కిలోమీటర్లు దాటి గనక మహిళ వెళ్లాల్సి వస్తే కుంటుంబ సభ్యుల తోడు కచ్చితంగా ఉండాల్సిందే. పురుషుడు రక్షణగా వెళ్లాల్సిందే.” అని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే తమ తమ వాహనాల్లో ప్రయాణించే సమయంలో మ్యూజిక్‌ను వినడం కూడా ఆపేయాలని సూచించింది. ప్రస్తుతం ఈ నిబంధన స్థానికంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.