మ్యారిటల్ రేప్.. కోర్టులో కేసులకు వచ్చినప్పుడు లేదా ఇతర పలు సందర్భాల్లో చర్చకు వస్తున్న అంశం. భార్యకు ఇష్టం లేకుండా శృంగారం చేయడాన్ని మ్యారిటల్ రేప్ అంటారు. దీన్ని భారత శిక్షాస్మృతి(ఐపీసీ) ప్రకారం ‘రేప్’ నిర్వచనం నుంచి మినహాయించారు. అయితే పడక గదిలో సెక్స్ విషయంలో భార్యాభర్తల వైఖరిలో గణనీయమైన మార్పులు వచ్చనట్టు ఇటీవల విడుదలైన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ ఎఫ్ హెచ్ ఎస్ -5) వెల్లడించింది. తనకు ఇష్టం, ఆసక్తి లేని సమయంలో సెక్స్‌కు నిరాకరిస్తున్నామని, ఆ విషయాన్ని భర్తతో చెప్పగలుగుతున్నామని భారత్‌లో 82 శాతం మహిళలు చెబుతున్నారు.
సరికాదన్న పురుషులు – 72 %
సరైనదే – 6 %
భార్యను మందలించవచ్చు – 19 %
మొదటి స్థానంలో గోవా — 92 %
టాప్ 10లో తెలంగాణ — 84.9 %
చివరిస్థానంలో అరుణాచల్ ప్రదేశ్ — 63 %