Tamil Nadu | ఆ వివాదంపై.. తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్‌కు సుప్రీంకోర్టు హెచ్చరిక
Tamil Nadu | తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్‌ను సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఇరువురి మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూచించింది. లేనిపక్షంలో తాము జోక్యం చేసుకుని పరిష్కరిస్తామని పేర్కొంది.
న్యూఢిల్లీ: తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్‌ను సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఇరువురి మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూచించింది. లేనిపక్షంలో తాము జోక్యం చేసుకుని పరిష్కరిస్తామని పేర్కొంది. తమిళనాడులోని (Tamil Nadu) విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ల (వీసీ) నియామకంపై సీఎం స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం, గవర్నర్ ఆర్ఎన్ రవి మధ్య చాలా కాలంగా వివాదం కొనసాగుతున్నది. గవర్నర్ వీసీగా వ్యహరించే అధికారాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. దీనితో పాటు పలు నియామకాల్లో గవర్నర్ అధికారాలను పరిమితం చేసింది. అయితే ఈ బిల్లులను ఆమోదించడానికి ఆర్ఎన్ రవి నిరాకరించారు.
కాగా, మద్రాస్ విశ్వవిద్యాలయం, భారతియార్ విశ్వవిద్యాలయం, తమిళనాడు ఉపాధ్యాయ శిక్షణ విశ్వవిద్యాలయాలకు వైస్-ఛాన్సలర్లను నియమించడానికి గవర్నర్ రవి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అయితే ఈ చర్య చట్టవిరుద్ధమని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి సభ్యులను తొలగించడంతోపాటు ఆ కమిటీని పునరుద్ధరించింది. ఈ నేపథ్యంలో ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది.
మరోవైపు తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్బీ పార్దివాలా నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ఇరువురు కలిసి బిల్లుల పెండింగ్ వివాదాన్ని పరిష్కరించుకోవడం మంచిదని సూచించింది. లేనిపక్షంతో ఈ సమస్యను తాము పరిష్కరిస్తామని కోర్టు హెచ్చరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

