Supreme Court: గుండె చప్పుడు ఆపలేం.. గర్భవిచ్ఛిత్తికి నో చెప్పిన సుప్రీంకోర్టు
Supreme Court: గర్భానికి 26 వారాల 5 రోజుల నిండాయని, ఈ సమయంలో గర్భవిచ్ఛిత్తికి అనుమతి ఇవ్వడం అంటే మెడికల్ టర్మినేషన్ యాక్టులోని
న్యూఢిల్లీ: గర్భవిచ్చిత్తికి అవకాశం కల్పించాలంటూ ఓ మహిళ పెట్టుకున్న అభ్యర్థనను సుప్రీంకోర్టు(Supreme Court) తిరస్కరించింది. 26 వారాల గర్భాన్ని తొలగించేందుకు ఆ మహిళకు సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వలేదు. శిశువులో ఎటువంటి సమస్య లేదని ఎయిమ్స్ వైద్యులు రిపోర్టు ఇచ్చారని, గర్భాన్ని తొలగించేందుకు అనుమతి ఇవ్వడం లేదని కోర్టు చెప్పింది. గర్భానికి 26 వారాల 5 రోజుల నిండాయని, ఈ సమయంలో గర్భవిచ్ఛిత్తికి అనుమతి ఇవ్వడం అంటే మెడికల్ టర్మినేషన్ యాక్టులోని 3, 5 సెక్షన్లను ఉల్లంఘించడమే అవుతుందని, ఆ చట్టం ప్రకారం తల్లికి ఎటువంటి ప్రమాదం లేదని, ఇది పిండానికి సంబంధించిన కేసు కాదు అని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. గుండె చప్పుడును ఆపలేమని తన తీర్పు సందర్భంగా సీజే అన్నారు. ఇద్దరు పిల్లల తల్లిని, మూడవ శిశవుకు జన్మనివ్వలేనని, డిప్రెషన్లో ఉన్నానని, గర్భాన్ని తొలగించుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఓ మహిళ అభ్యర్థన పెట్టుకున్న విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sweet Corn | మీ డైట్లో స్వీట్ కార్న్ ఉందా.. అయితే మీ ఆరోగ్య సమస్యలకు మీరు చెక్ పెడుతున్నట్టే..!
Rinku Singh | సమాజ్‌వాది పార్టీ ఎంపీని పెళ్లి చేసుకోబోతున్న క్రికెటర్ రింకూ సింగ్.. ఆమె ఎవరంటే..!
Pregnancy | 30 ఏళ్ల వయస్సులో గర్భం దాల్చడం కష్టమవుతుందా.. అండాల సంఖ్య తగ్గుతుందా..?
Bulgaria Accident | పొగమంచు ఎఫెక్ట్.. ఒకదానినొకటి ఢీకొన్న 86 వాహనాలు.. 12 మంది మృతి
Health Tips | వ్యాయామం చేసేటప్పుడు ఏదిపడితే అది తింటే ప్రమాదం.. ఎందుకో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

