సీఈసీకి చట్ట రక్షణపై రగడ
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) జరుపుతున్న నిరసనలో ఆ పార్టీ ప్రధాన డిమాండ్లలో ఒకటి సర్ ద్వారా పౌరుల సామూహిక ఓటు హక్కును హరించినందుకు ఆయనపై క్రిమినల్ విచారణ ప్రారంభించడం. అయితే మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంతో సీఈసీపైన కానీ, ఈసీలపైన కానీ ఎటువంటి క్రిమినల్ చర్యలు చేపట్టేందుకు వీల్లేదు.
- ‘సర్’ అక్రమాలకు పాల్పడినందుకు క్రిమినల్ విచారణ జరుపాలని విపక్షాల డిమాండ్
- సీఈసీ, ఈసీలు క్రిమినల్ చర్యల పరిధిలోకి రాకుండా 2023లో కేంద్రం చట్ట సవరణ
న్యూఢిల్లీ, అక్టోబర్ 13: సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) జరుపుతున్న నిరసనలో ఆ పార్టీ ప్రధాన డిమాండ్లలో ఒకటి సర్ ద్వారా పౌరుల సామూహిక ఓటు హక్కును హరించినందుకు ఆయనపై క్రిమినల్ విచారణ ప్రారంభించడం. అయితే మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంతో సీఈసీపైన కానీ, ఈసీలపైన కానీ ఎటువంటి క్రిమినల్ చర్యలు చేపట్టేందుకు వీల్లేదు.
ఈ చట్టం అమల్లో ఉన్నంతకాలం సీఈసీ, ఈసీలను వారి అధికారిక విధులను నిర్వర్తించినప్పుడు తీసుకున్న చర్యలు, నిర్ణయాలు లేదా ప్రకటనలకు సంబంధించి కోర్టు కేసుల నుంచి రక్షిస్తుంది. సర్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా సీఈసీ, ఈసీలకు కల్పించిన చట్టపరమైన రక్షణ, రాజ్యాంగ న్యాయస్థాన న్యాయమూర్తులకు లభించే రక్షణ కన్నా కూడా విస్తృతమైనదిగా ఉండవచ్చని సుప్రీంకోర్టు ఈనెల 5న మౌఖికంగా వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో సీఈసీ, ఈసీలకు ఈ రక్షణ కల్పించే 2023 చట్టంలోని సెక్షన్ 16పై సర్వత్రా చర్చ నడుస్తున్నది.
చట్టపరమైన చర్యలకు వీలుండదు
నరేంద్ర మోదీ ప్రభుత్వం 2023 ఆగస్టు 10న రాజ్యసభలో ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ), ఎన్నికల కమిషనర్ల(నియామకం, సర్వీసు, షరతులు, పదవీకాలం) బిల్లును ప్రవేశపెట్టినప్పుడు దానిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. సీఈసీ, ఈసీల నియామకాలు చేయడంలో ఈ బిల్లు ప్రభుత్వానికి తిరుగులేని ఆధిపత్యాన్ని కల్పించడమే కాకుండా, జీత భత్యాలు, ఇతర సర్వీసు నిబంధనల విషయంలో సీఈసీ, ఈసీలను క్యాబినెట్ సెక్రటరీతో సమాన స్థాయికి తీసుకురావాలని ఇది కోరుతున్నదనే విషయంపైనా చర్చ జరిగింది.
గతంలో వారు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సమాన స్థాయిలో ఉండేవారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సమాన స్థాయిని అనుభవించిన సీఈసీ, ఈసీలకు ఆ స్థాయిని ప్రతిపాదిత చట్టం ద్వారా తొలగించాలని చూడడం పట్ల కూడా విపక్ష పార్టీలు అభ్యంతరం తెలిపాయి. విపక్షాల అభ్యంతరాల నడుమ ఈ చట్టం పార్లమెంట్ ఆమోదం పొందింది. ఈ చట్టంలోని మరో ప్రధాన అంశం సీఈసీ, ఈసీలు తమ అధికారిక హోదాలో చేసే అన్ని చర్యలకు చట్టపరమైన రక్షణ పొందుతారు. అంటే వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకొనేందుకు చట్టం అనుమతించదు.
చర్చ లేకుండానే ఆమోదం
అయితే సభ్యులకు మొదట అందించిన బిల్లు ప్రతిలో లేని ఒక నిబంధన చివరకు చట్టంలో చేరింది. 2023 డిసెంబర్ 12న రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, ఎన్నికల కమిషనర్లకు కీలకమైన చట్టపరమైన రక్షణ కల్పించే కొత్త క్లాజ్ 15ఏను చేర్చాలని సవరణ ప్రతిపాదించారు. చర్చ చివరలో ప్రవేశపెట్టిన ఈ సవరణ ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదం పొందింది. అనంతరం రాజ్యసభ చైర్మన్ దానిని క్లాజ్ 16గా చేర్చేందుకు అంగీకరించారు.
‘ప్రస్తుతం అమల్లో ఉన్న ఇతర చట్టాల్లో ఏది ఎలా ఉన్నప్పటికీ, చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా లేదా ఎన్నికల కమిషనర్‌గా ఉన్న లేదా గతంలో పనిచేసిన ఏ వ్యక్తిపైనా, తన అధికారిక విధులు లేదా బాధ్యతలు నిర్వర్తించే సమయంలో లేదా వాటిని నిర్వర్తిస్తున్నట్టు భావించి చేసిన ఏ చర్య, పని లేదా వ్యాఖ్యకు సంబంధించి ఏ న్యాయస్థానమూ సివిల్ లేదా క్రిమినల్ విచారణను స్వీకరించకూడదు లేదా కొనసాగించకూడదు’ అని ఈ సెక్షన్ పేర్కొంటున్నది.
సెక్షన్ 16పై సుప్రీంకోర్టు విచారణ
సీఈసీ, ఈసీలు వారి అధికారిక విధుల నిర్వహణలో తీసుకునే చర్యలకు న్యాయపరమైన చర్యల నుంచి శాశ్వత రక్షణ కల్పించే 2023 నాటి చట్టంలోని నిబంధనను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు మంగళవారం అంగీకరించింది. కేంద్రంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులిచ్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

