Supreme Court | ప్రైవేట్ ఆస్తుల స్వాధీనం కుదరదు..! చారిత్రాత్మక తీర్పును వెల్లడించిన ‘సుప్రీం’..
Supreme Court | ప్రైవేటు ఆస్తుల స్వాధీనం విషయంలో సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ప్రైవేటు యాజమాన్యంలో ఉన్న అన్ని ఆస్తులను ఉమ్మడి ప్రయోజనం కోసం ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు వీలులేదని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది.
Supreme Court | ప్రైవేటు ఆస్తుల స్వాధీనం విషయంలో సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ప్రైవేటు యాజమాన్యంలో ఉన్న అన్ని ఆస్తులను ఉమ్మడి ప్రయోజనం కోసం ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు వీలులేదని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. 8:1 మెజారిటీతో సుప్రీంకోర్టు ఈ తీర్పును ఇచ్చింది. సీజేఐ జస్టిస్ చంద్రచూడ్‌తో పాటు మరో ఆరుగురు న్యాయమూర్తులు ఒకటి.. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సుధాన్షు ధూలియా వేర్వేరుగా మూడు తీర్పును రాశారు.
సీజేఐ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సుధాన్షు ధులియా, జస్టిస్ జేబీ పార్ధీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ రాజేశ్ బిండాల్, జస్టిస్ ఎస్సీ శర్మ, జస్టిస్ ఏజీ మనీష్ రాజ్యాంగ ధర్మాసనం పిటిషన్లపై విచారణ జరిపి తీర్పును వెలువరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 39(బి) ప్రకారం ప్రతి ప్రైవేటు ఆస్తిని కమ్యూనిటీ ఆస్తిలో భాగంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. చట్టాలు, విధానాల రూపకల్పనలో రాజ్యాంగం నిర్దేశించిన మార్గదర్శకాలను ప్రభుత్వాలు పాటించాలని ఈ ఆర్టికల్ చెబుతుందని.. ప్రైవేట్ యాజమాన్యంలోని ఆస్తులు ఉమ్మడి ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోవచ్చని.. కానీ, ఒక వ్యక్తికి చెందిన ప్రతి వనరునూ ఉమ్మడి ప్రయోజనంగా పరిగణించబడదని.. అది భౌతిక అవసరాలకు తగినదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
దాంతో సుప్రీంకోర్టు 1978 నాటి ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం 4:3 మెజారిటీతో ఇచ్చిన తీర్పును పక్కనపెట్టింది. ఉమ్మడి ప్రయోజనాల కోసం ప్రభుత్వం అన్ని ప్రైవేట్ ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చని పేర్కొంది. ప్రత్యేక ఆర్థిక, సామ్యవాద భావజాలం స్ఫూర్తితో ప్రభుత్వం ప్రైవేట్ ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చని ఏడుగురు న్యాయమూర్తుల మెజారిటీ నిర్ణయం పేర్కొంది. సర్వోన్నత న్యాయస్థానం తాజా తీర్పుతో ప్రైవేట్ యాజమాన్యాల యాజమాన్యంలోని అన్ని వనరులను ఇకపై ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు వీలుండదు.
సుప్రీంకోర్టు తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనంలో ఇద్దరు న్యాయమూర్తులు భిన్నమైన నిర్ణయం తీసుకున్నారు. బెంచ్ నిర్ణయాన్ని జస్టిస్ బివి నాగరత్న పాక్షికంగా విభేదించగా.. జస్టిస్ సుధాన్షు ధులియా పూర్తిగా విభేదించారు. రాజ్యాంగం ప్రకారం, ఉమ్మడి ప్రయోజనాల కోసం ప్రైవేట్ యాజమాన్యంలోని అన్ని వనరులను స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వాలకు లేదని మంగళవారం 7:2 మెజారిటీ నిర్ణయంలో సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే, కొన్ని కేసుల్లో ప్రభుత్వాలు ప్రైవేట్ ఆస్తులను క్లెయిమ్ చేసుకోవచ్చని సీజేఐ నేతృత్వంలోని తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
IAS Transfers | రాష్ట్రంలో మరోసారి ఐఏఎస్‌ల బదిలీలు.. కీలక శాఖల్లో కొత్త నియామకాలు
Idupu Kaayitham | ‘ఇడుపు కాయితం’ ఆద్యంతం ఎంగేజ్ చేస్తుంది.. థియేటర్ నుంచి హ్యాపీగా వెళ్తారు: బన్నీ వాస్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

