SpiceJet Chief | స్పైస్‌జెట్ చీఫ్ అజయ్‌సింగ్‌కు సుప్రీంకోర్టు షాక్.. వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ సమన్లు జారీ
SpiceJet Chief | స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్ చీఫ్ అజయ్ సింగ్‌కు సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. క్రెడిట్ సూయిస్ (Credit Suisse) ధిక్కార కేసులో నాలుగు వారాల్లోగా స్పందించాలని అజయ్ సింగ్‌ను ఆదేశించింది.
SpiceJet Chief: స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్ చీఫ్ అజయ్ సింగ్‌కు సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. క్రెడిట్ సూయిస్ (Credit Suisse) ధిక్కార కేసులో నాలుగు వారాల్లోగా స్పందించాలని అజయ్ సింగ్‌ను ఆదేశించింది. అజయ్ సింగ్, స్పైస్‌జెట్‌లపై ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ క్రెడిట్ సూయిస్ ఈ ఏడాది మార్చిలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారన్న క్రెడిట్ సూయిస్ అరోపించింది. ఇరుపక్షాల మధ్య జరిగిన సెటిల్మెంట్ ప్రకారం 3.9 మిలియన్ల డాలర్ల బకాయిలు చెల్లించడంలో విఫలమైనందుకు అజయ్‌సింగ్, స్పైస్‌జెట్‌లపై ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో కోర్టు తాజా సమన్లు జారీ చేసింది. కాగా క్రెడిట్ సూయిస్, స్పైస్‌జెట్ మధ్య 2015 నుంచి వివాదం నడుస్తోంది. స్పైస్‌జెట్ యాజమాన్యం సుమారు 24 మిలియన్ డాలర్ల బకాయిలను ఎగ్గొట్టారని క్రెడిట్ సూయిస్ ఆరోపిస్తోంది.
దీనిపై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు చివరికి 2021లో ఎయిర్‌లైన్‌ను మూసివేయాలని సూచించింది. అయితే హైకోర్టు ఉత్తర్వులపై అప్పీల్‌తో సుప్రీంకోర్టు మూసివేత ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసింది. ఇరుపక్షాలు చర్చలతో ఒక పరిష్కారానికి వచ్చేందుకు అనుమతినిచ్చింది. ఆగస్టు 2022లో తమ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ఒప్పందం జరిగిందని ఇరుపక్షాలు కోర్టుకు తెలిపాయి. అయితే, ఒప్పందం ప్రకారం బకాయిలు చెల్లించలేదంటూ క్రెడిట్ సూయిస్ అజయ్ సింగ్‌పై ధిక్కార కేసు వేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Will Sit On Dharna | ‘అక్కడ కూర్చొని ధర్నా చేస్తాం’.. ఢిల్లీ హైకోర్టు సమీపంలో రోడ్డు పనుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
Bangladesh | బంగ్లాదేశ్ రిసార్ట్‌లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
TN CM Vijay | మ్యూజిక్ డైరెక్టర్ దేవాకు తమిళనాడు సీఎం, మాజీ సీఎం నివాళులు.. Videos
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

