Gyanvapi Mosque Survey: జ్ఞానవాపి మసీదులో సర్వేకు సుప్రీంకోర్టు బ్రేక్..
Gyanvapi Mosque Survey : జ్ఞానవాపీ మసీదులో ఒక్క ఇటుకను కూడా కదల్చలేదని ఇవాళ సుప్రీంకోర్టుకు కేంద్రం చెప్పింది. కేవలం ఫోటోగ్రఫీ, రేడార్ స్టడీ చేస్తున్నట్లు వెల్లడించింది. అయితే ఆ మసీదులో సర్వేను నిలిపివేయాలని ఇవాళ సుప్రీం ఆదేశించింది. జూలై 26వ తేదీ వరకు సర్వేకు బ్రేక్ వేసింది. ముస్లిం గ్రూపు ఈ కేసులో అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించుకునే వీలును కల్పించింది.
వారణాసి: జ్ఞానవాపి మసీదు(Gyanvapi Mosque Survey)లో పురావాస్తు శాఖ చేపడుతున్న సర్వేను రెండు రోజుల పాటు నిలిపివేస్తూ సుప్రీంకోర్టు ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. కాశీ విశ్వనాథుడి ఆలయ ప్రాంగణంలో ఉన్న జ్ఞానవాపీ మసీదులో ఇవాళ ఉదయం ఏడు గంటలకు శాస్త్రీయ సర్వే ప్రారంభమైన విషయం తెలిసిందే. సర్వే పేరుతో మసీదులో తొవ్వకాలు జరిగే ప్రమాదం ఉందని జ్ఞానవాపీ మసీదు మేనేజ్మెంట్ అనుమానాలు వ్యక్తం చేసింది. దీంతో సర్వేకు కోర్టు బ్రేక్ వేసింది. అయితే సర్వే వల్ల మసీదుకు ఎటువంటి ప్రమాదం ఉండదని, మసీదులో ఉన్న ఒక్క ఇటుకను కూడా తీయలేదని, అలాంటి ఉద్దేశం కూడా లేదని కోర్టుకు కేంద్రం వెల్లడించింది. సర్వేలో భాగంగా మసీదును కొలతలు తీసుకోవడంతో పాటు ఫోటోగ్రఫీ, రేడార్ స్టడీ చేయనున్నట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు.
మసీదులో సర్వే కోసం జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధిస్తున్నామని, అయితే ఈ కేసులో ముస్లిం కమిటీ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు సీజే డీవై చంద్రచూడ్ తెలిపారు. జూలై 26వ తేదీ వరకు జిల్లా కోర్టు ఆదేశాలపై స్టే విధిస్తున్నట్లు సుప్రీం పేర్కొన్నది. ముస్లిం వర్గం సమర్పించే అఫిడవిట్‌ను హైకోర్టు ముందు ప్రవేశపెట్టాలని రిజిస్ట్రార్‌కు సుప్రీం ఆదేశాలు ఇచ్చింది.
ముస్లిం గ్రూపు తరపు సీనియర్ న్యాయవాది హుజేఫా అహ్మాది వాదించారు. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా చాలా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తోందని, ఇప్పటికే మసీదులోని పశ్చిమ గోడను తొవ్వడం ప్రారంభించినట్లు ఆయన కోర్టుకు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

