సుప్రీంకోర్టుకు రిపోర్ట్ అందజేసిన సిర్పూర్కర్ కమిటీ
న్యూఢిల్లీ: 2019 డిసెంబర్లో హైదరాబాద్ సమీపంలో జరిగిన నలుగురి ఎన్‌కౌంటర్‌పై ఇవాళ సిర్పూర్కర్ కమిషన్ తన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. సీజేఐ ఎన్వీ రమణ, జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన ధర్మాసనం ఇవాళ కమిషన్ రిపోర్ట్‌ను అందుకున్నది. అయితే ఆ నివేదిక సీల్డ్ కవర్లోనే ఉండాలని చేసిన తెలంగాణ ప్రభుత్వ సూచనను కోర్టు తిరస్కరించింది. కేసుతో లింకు ఉన్న అన్ని పార్టీలకు ఆ రిపోర్ట్‌ను అందజేయాలని ధర్మాసనం ఆదేశించింది. అన్ని రికార్డులను తెలంగాణ హైకోర్టుకు పంపాలని, ఆ రిపోర్ట్ ఆధారంగా హైకోర్టు తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు సుప్రీం చెప్పింది.
26 ఏళ్ల వెటర్నరీ లేడీ డాక్టర్‌ను రేప్ చేసి హత్య చేసిన కేసులో నలుగురు వ్యక్తులను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఆ కేసులో విచారణ చేపట్టేందుకు అప్పటి సీజేఐ ఎస్ఏ బోబ్డే ఓ ఎంక్వైరీ ప్యానల్‌ను ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ వీఎస్ సిర్పూర్కర్ నేతృత్వంలో ప్యానల్ ఆ ఎన్‌కౌంటర్‌పై రిపోర్ట్‌ను తయారు చేసింది. ఆ బృందంలో బాంబే హైకోర్టు జస్టిస్ రేఖా బాల్దోటా, సీబీఐ మాజీ డైరెక్టర్ డీఆర్ కార్తికేయన్ ఉన్నారు. రిపోర్ట్‌ను సీల్డ్ కవర్లోనే ఉంచాలని తెలంగాణ సీనియర్ న్యాయవాది శ్యామ్ దివన్ కోరారు. కానీ ఆ అభ్యర్థనను సీజేఐ తిరస్కరించారు. దీంట్లో రహస్యం ఏమీ లేదని, కొందరు దోషులుగా తేలారని, ఇక ఆ రాష్ట్రమే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని సీజేఐ రమణ తెలిపారు.
రేప్ కేసు నిందితులను చంపాలన్న ఉద్దేశంతో పోలీసులు ఎన్కౌంటర్ చేసినట్లు కమిటీ తన రిపోర్ట్‌లో తెలిపింది. నలుగురు నిందితుల్లో ముగ్గురు మైనర్లు ఉన్నారని, హైదరాబాద్ పోలీసుల పనితీరుపై కూడా రిపోర్ట్‌లో పొందుపరిచారు. ఈ కేసు విచారణలో చాలా లోపాలు ఉన్నట్లు కమిషన్ వెల్లడించింది. ఈ కేసుతో లింకు ఉన్న పది మంది పోలీసుల్ని విచారించాలని కమిటీ అభిప్రాయపడింది. ఎన్కౌంటర్లో మృతిచెందిన జోలు శివ, జోలు నవీన్, చింతకుంట చెన్నకేశవులు మైనర్లు అని రిపోర్ట్ పేర్కొన్నది.
10 మంది పోలీసు అధికారులు ఈ ఎన్కౌంటర్ ఘటనలో పాల్గొన్నారని, వీరందరిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి విచారణ జరపాలని కమిషన్ తెలిపింది. పోలీస్ అధికారులు సురేందర్, నరసింహారెడ్డి, షేక్ లాల్ మదార్, సిరాజుద్దీన్, రవి, వెంకటేశ్వర్లు, అరవింద్ గౌడ్, జానకీ రామ్, బాలు రాథోడ్, శ్రీకాంత్ ఆ జాబితాలో ఉన్నారు. వీరిపై ఐపీసీ 302, సెక్షన్ 201 ప్రకారం కేసు నమోదు చేసి విచారణ జరపాలిని కమిషన్ తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు : విజయ రమణారావు
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో నాలుగు వెంటిలేటర్లు మాయం.. సీసీ కెమెరాల్లో చోరీ దృశ్యాలు రికార్డు!
Sandeep Reddy Vanga | రాప్తాడు ఘటనపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్.. విషాదాన్ని అవకాశంగా మార్చుకోవద్దు!
Suspension | కామారెడ్డి మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 14 మంది మెడికోలపై సస్పెన్షన్!
Jagtial Child | జగిత్యాల చిన్నారి ఘటనలో ట్విస్ట్.. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని కలెక్టర్ పిటిషన్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

