Satyendar Jain | ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్‌కు ఊరట.. మధ్యంతర బెయిల్ పొడిగింపు..
Satyendar Jain | మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్‌కు సుప్రీంకోర్టు సోమవారం ఊరటనిచ్చింది. వైద్య కారణాలతో సత్యేంద్ర జైన్‌కు మంజూరైన మధ్యంతర బెయిల్‌ను కోర్టు అక్టోబర్ 8 వరకు పొడిగించింది.
Satyendar Jain | మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్‌కు సుప్రీంకోర్టు సోమవారం ఊరటనిచ్చింది. వైద్య కారణాలతో సత్యేంద్ర జైన్‌కు మంజూరైన మధ్యంతర బెయిల్‌ను కోర్టు అక్టోబర్ 8 వరకు పొడిగించింది. జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ బేల ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం మరోసారి అక్టోబర్ 9న విచారించనున్నది. ఇంతకు ముందు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ను ఈ నెల 25 వరకు పొడిగించింది. సత్యేంద్ర జైన్‌కు జూలై 21న శస్త్రచికిత్స జరిగింది. వైద్య పరమైన కారణాలతో మధ్యంతర బెయిల్‌ను కోర్టు పొడిగించింది. మనీలాండరింగ్ కేసులో సత్యేందర్ జైన్‌కు మే 26న సుప్రీంకోర్టు ఆరు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకునేందుకు అనుమతి ఇచ్చిన కోర్టు.. సాక్షులను ప్రభావితం చేయొద్దని హెచ్చరించింది. అలాగే, అనుమతి లేకుండా ఢిల్లీ దాటి బయటకు వెళ్లకూడదని, మీడియాతో మాట్లాడొద్దని స్పష్టం చేసింది. వాస్తవానికి సత్యేందర్ జైన్ 202 మే 31 నుంచి మనీలాండరింగ్ కేసులో కస్టడీలో ఉన్నారు. ఏప్రిల్ 6న ఢిల్లీ హైకోర్టు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించగా.. ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సత్యేందర్ జైన్ మే 25న తీహార్ జైలులోని వాష్‌రూంలో జారిపడిపోయారు. అనంతరం దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత ఆరోగ్య పరిస్థితి విషమించడంతో లోక్‌నాయక్ జైప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రికి తరలించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ కంటే ‘ఆదిపురుష్’ విజువల్స్ బెటరా.. గ్రాఫిక్స్ విషయంలో ప్రభాస్ సినిమాకే ఎక్కువ మార్కులు!
MLA Murali Naik | దీపావళి వేడుకల్లో ఎమ్మెల్యే మురళీ నాయక్ చేదు అనుభవం : వీడియో
Virosh | జపాన్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దీపావళి వేడుకలు.. విదేశీ గడ్డపై సంప్రదాయ హోమం!
Police Misconduct | పోలీసుల దారిదోపిడీ..! కానిస్టేబుల్,హోంగార్డుపై కేసు.. కానిస్టేబుల్ పరారీ
Renu Desai | దీపావళి వేడుకల్లో రేణూ దేశాయ్.. ‘చంద్రకోర’ తిలకం ధరించి అందరి దృష్టిని ఆకర్షించిన నటి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

