Rahul Gandhi: రాహుల్ గాంధీ ‘సర్’ పిటీషన్లో 10 లోపాలు.. ఐడీ కార్డులు అడిగిన రిజిస్ట్రీ
Rahul Gandhi: ఓటర్ల సవరణ జాబితా కోసం చేపట్టిన సర్ ప్రక్రియలో అక్రమాలు జరిగినట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోమవారం సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. అయితే ఆ పిటీషన్లో 10 లోపాలు ఉన్నట్లు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ పేర్కొన్నది. రాహుల్, ఖర్గేలు తమ ఐడీలు ఇవ్వాలని తెలిపింది.
న్యూఢిల్లీ: ఓటర్ల సవరణ జాబితా కోసం చేపట్టిన సర్ ప్రక్రియలో అక్రమాలు జరిగినట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) సోమవారం సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. అయితే ఆ పిటీషన్లో 10 లోపాలు ఉన్నట్లు సుప్రీంకోర్టు పేర్కొన్నది. పిటీషన్‌కు చెందిన తప్పులు లేని కాపీని మరోసారి సమర్పించాలని రాహుల్ గాంధీ తరపు లాయర్‌ను సుప్రీంకోర్టు రిజిస్ట్రీ కోరింది. రాహుల్ గాంధీతో పాటు రాజ్యసభ విపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గేకు చెందిన ఐడీ కార్డులను కూడా సమర్పించాలని కోర్టు పేర్కొన్నది.
పిటీషన్లో కొన్ని పేజీలు మిస్సైనట్లు కూడా సుప్రీం రిజిస్ట్రీ తెలిపింది. ఇంకా కోర్టు ఫీజులో కూడా తేడా ఉందని, సుమారు మరో 200 ఫీజు రూపంలో చెల్లించాలని కోర్టు పేర్కొన్నది. సోమవారం రాహుల్ గాంధీతో పాటు ఇతర విపక్ష నేతలు సర్‌కు వ్యతిరేకంగా పిటీషన్ దాఖలు చేసేందుకు సుప్రీంకోర్టు వరకు ర్యాలీ తీసిన విషయం తెలిసిందే. సర్ ప్రక్రియలో జరిగిన ఓట్ల తొలగింపు కానీ, ఓటర్ల జాబితాలో మార్పు అంశంపై కానీ, రిటైర్డ్ సుప్రీం జడ్జీ నేతృత్వంలో కమిటీ వేసే దర్యాప్తు చేపట్టాలని పిటీషన్లో కోరారు.
అయితే సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారం ఒకవేళ పిటీషన్లో లోపాలు ఉంటే సదరు పిటీషన్‌దారుడికి ఆ పిటీషన్‌ను సరి చేసుకునేందుకు కనీసం 28 రోజల సమయాన్ని ఇస్తారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఉచిత విద్యుత్ కు ఎసరు పెట్టే కుట్ర.. రైతు డిస్కమ్ ఏర్పాటు జీవోపై హరీశ్‌రావు సీరియస్
Rahul Gandhi: రాహుల్ గాంధీ ‘సర్’ పిటీషన్లో 10 లోపాలు.. ఐడీ కార్డులు అడిగిన రిజిస్ట్రీ
Ranabaali | ‘రణబాలి’ నార్త్ అమెరికా ప్రీ సేల్స్ ఎంత .. విజయ్ దేవరకొండ సినిమాకు ఇంకా పెరగాల్సిందే!
Manthani | మంథనిలో అక్రమంగా తరలిస్తున్న 11 ఆవులు పట్టివేత
పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి.. ముగ్గురు అరెస్ట్.. రూ.17,300 నగదు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

