Waqf Amendament Act | వక్ఫ్ (సవరణ) చట్టం 2025పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ఆ నిబంధన నిలిపివేత
Waqf Amendament Act | వక్ఫ్ (సవరణ) చట్టం 2025 మొత్తంపై స్టే విధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. కాకపోతే కొన్ని కీలక ప్రొవిజన్లను మాత్రం నిలిపివేసింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్‌తో కూడిన ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది.
Waqf Amendament Act | వక్ఫ్ (సవరణ) చట్టం 2025 మొత్తంపై స్టే విధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. కాకపోతే కొన్ని కీలక ప్రొవిజన్లను మాత్రం నిలిపివేసింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్‌తో కూడిన ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది.
కనీసం ఐదేళ్ల పాటు ఇస్లాం మతాన్ని ఆచరించిన వ్యక్తి మాత్రమే ఆస్తిని వక్ఫ్‌గా చేయడానికి అవకాశం ఉంటుందన్న నిబంధన (సెక్షన్ 3)ని సుప్రీంకోర్టు నిలిపివేసింది. ఒక వ్యక్తి ఐదేళ్ల పాటు ముస్లిం మతాన్ని ఆచరించడానికి ఎలా నిర్ణయించాలో ఆ నియమాలను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించేంత వరకు ఈ నిబంధనను ఆపేస్తున్నట్లు జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనం తెలిపింది. సెక్షన్ 3తో పాటు 9, 14, 23, 36, 107, 108 సెక్షన్లను సుప్రీంకోర్టు నిలిపివేసింది. అలాగే కొన్ని సెక్షన్లకు మాత్రం కొంత రక్షణ అవసరమని వ్యాఖ్యానించింది.
వక్ఫ్, వక్ఫ్ వాటాదారుల హక్కులను జిల్లా కలెక్టర్ వంటి ప్రభుత్వ అధికారులు నిర్ణయించడానికి అనుమతించడం అధికార విభజన సిద్ధాంతానికి విరుద్ధంగా ఉందని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనం అభిప్రాయపడింది. వక్ఫ్ బోర్డులో ముస్లిం సభ్యుల సంఖ్య కచ్చితంగా మెజారిటీలో ఉండాలని పేర్కొంది. బోర్డులో అత్యధికంగా ముగ్గురు లేదా నలుగురు ముస్లిమేతర సభ్యులు ఉండొచ్చని సూచించింది. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ముస్లిం వ్యక్తే ఉండటం మంచిదని అభిప్రాయపడింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

