Pahalgam Attack: పెహల్గామ్ దాడి ఘటనపై దర్యాప్తు.. పిల్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు
Pahalgam Terror Attack: పెహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై రిటైర్డ్ జడ్జీతో న్యాయ విచారణ చేపట్టాలని దాఖలైన పిటీషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జస్టిస్ సూర్య కాంత్, ఎన్కే సింగ్‌తో కూడిన ధర్మాసనం ఆ పిటీషన్‌ను తిరస్కరించింది.
న్యూఢిల్లీ: పెహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై రిటైర్డ్ జడ్జీతో న్యాయ విచారణ చేపట్టాలని దాఖలైన పిటీషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జస్టిస్ సూర్య కాంత్, ఎన్కే సింగ్‌తో కూడిన ధర్మాసనం ఆ పిటీషన్‌ను తిరస్కరించింది. ఫతేష్ సాహూ అనే వ్యక్తి పిటీషన్ దాఖలు చేశారు. ఇలాంటి సమయంలో సైనిక బలగాలను నిర్వీర్యం చేయరాదు అని కోర్టు అభిప్రాయపడింది. ఉగ్రవాదంపై పోరాటం చేసేందుకు ప్రతి ఒక్క భారతీయుడు చేయి చేయి కలిపిన కీలకమైన సమయమిదని, ఇలాంటి సందర్భంలో సైనిక దళాల మనోస్థైర్యాన్ని దెబ్బతీయరాదు అని, ఆ అంశంలో ఉన్న సున్నితత్వాన్ని అర్థం చేసుకోవాలని ధర్మాసనం పేర్కొన్నది.
సమస్యలను పరిష్కరించడమే జడ్జీల టాస్క్ అని, దర్యాప్తులు చేపట్టడం తమ పని కాదు అని సుప్రీంకోర్టు తెలిపింది. బాధ్యతాయుతమైన వ్యక్తిగా వ్యవహరించాలని, భద్రతా దళాలను ఇలాగే నిర్వీర్యం చేస్తారా అని, ఎప్పటి నుంచి హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీలు దర్యాప్తుల్లో నిపుణులు అయ్యారని కోర్టు ప్రశ్నించింది. తాము కేవలం వివాదాలను పరిష్కరిస్తామని ధర్మాసనం తెలిపింది.
సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో దర్యాప్తు చేపట్టాలని దాఖలు చేసిన పిటీషన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు పిటీషనర్ తెలిపారు. జమ్మూకశ్మీర్‌కు చెందిన విద్యార్థుల సమస్యల పరిష్కారానికి హైకోర్టును ఆశ్రయించేందుకు ఆ పిటీషనర్‌కు కోర్టు అనుమతి ఇచ్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

