కోర్టును ఎవరూ బెదిరించలేరు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 12న ఇండియా కూటమి నాయకులతో కలిసి రాహుల్ సుప్రీంకోర్టుకు మార్చ్ నిర్వహించి నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. దీనిని తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు.. వివరణ ఇవ్వాలంటూ రాహుల్‌తోపాటు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా సహా పలువురు ఇండియా కూటమి నేతలకు నోటీసులు జారీచేసింది.
- సుప్రీంకోర్టుకే మార్చ్ చేస్తారా?
- రాహుల్ గాంధీపై సుప్రీం ఆగ్రహం
- వివరణ ఇవ్వాలంటూ నోటీసులు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 12న ఇండియా కూటమి నాయకులతో కలిసి రాహుల్ సుప్రీంకోర్టుకు మార్చ్ నిర్వహించి నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. దీనిని తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు.. వివరణ ఇవ్వాలంటూ రాహుల్‌తోపాటు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా సహా పలువురు ఇండియా కూటమి నేతలకు నోటీసులు జారీచేసింది. ఇలాంటి చర్యలతో సుప్రీంకోర్టును బెదిరించలేరని మందలించింది. భారత ఎన్నికల సంఘం(ఈసీఐ), ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌కు సంబంధించిన అంశాలపై రాజకీయ నాయకులు, వారి మద్దతుదారులు ఈనెల 12న సుప్రీంకోర్టు వైపు చేపట్టిన ప్రదర్శనకు సంబంధించి ఈ పిటిషన్లు దాఖలయ్యాయి.
లోక్‌సభ, రాజ్యసభలోని ప్రతిపక్ష నాయకులు ఈ అంశాలపై సీజేఐని కలసి వినతిపత్రం సమర్పించాలని కోరగా, ఈ విషయాలు ఇప్పటికే కోర్టు పరిశీలనలో ఉన్నాయని పేర్కొంటూ ఆయన అందుకు నిరాకరించారు. ఆ తర్వాతే ఈ ప్రదర్శన జరిగింది. విచారణ సందర్భంగా సీజేఐ సూర్యకాంత్ మాట్లాడుతూ కోర్టును ఎవరూ భయపెట్టలేరు అని మౌఖికంగా పేర్కొన్నారు. విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫున న్యాయవాది గౌరవ్ భాటియా వాదిస్తూ సుప్రీంకోర్టు ఒక రాజకీయ ఊరేగింపునకు సంబంధించిన వ్యవహారాన్ని చూడాల్సి రావడం అంగీకరించలేని విషయమని పేర్కొన్నారు.
సుప్రీంకోర్టులో జరిగిన ఘటన జరగకూడనిదని ఆయన అన్నారు. ఇలాంటి ప్రవర్తన బెదిరింపు కిందకు వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తూ సుమారు 200 మంది న్యాయవాదులు ఒక వినతిపత్రంపై సంతకం చేశారని భాటియా కోర్టుకు తెలిపారు. దీనికి సీజేఐ సూర్యకాంత్ స్పందిస్తూ మమ్మల్ని ఎవరూ బెదిరించలేరు అని గట్టిగా బదులిచ్చారు. అయితే, ఈ ప్రయత్నమే ఆందోళనకరమని భాటియా పేర్కొన్నారు. ప్రదర్శన సందర్భంగా గర్భిణి అయిన జర్నలిస్టును తోసేశారని వాదిస్తూ కోర్టుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ని భద్రపరచాలని కోరారు. దీనిపై సీజేఐ స్పందిస్తూ అటువంటి ప్రయత్నాలను ఎవరూ పట్టించుకోరని, కోర్టు ప్రాంగణం వెలుపల జరుగుతున్న పరిణామాల గురించి తమకు తెలుసని ఆయన అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

