Rahul Gandhi: రాహుల్ అనర్హత వేటు కేసులో పూర్ణేశ్ మోదీకి సుప్రీం నోటీసులు
Rahul Gandhi Disqualification Case: అనర్హత వేటుపై స్టే ఇవ్వాలని రాహుల్ గాంధీ సుప్రీంను ఆశ్రయించారు.ఆ కేసులో ఇవాళ సుప్రీం నోటీసులు జారీ చేసింది. పూర్ణేశ్ మోదీతో పాటు గుజరాత్ సర్కార్‌కు ఆ ఆదేశాలు ఇచ్చింది. మళ్లీ ఆగస్టు 4వ తేదీన ఈ కేసును కోర్టు విచారించనున్నది.
న్యూఢిల్లీ: దొంగలందరికీ మోదీ ఇంటిపేరు ఉందని రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై గుజరాత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఆ కేసులో ఇవాళ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గుజరాత్ కోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని రాహుల్ వేసిన పిటీషన్‌పై స్పందిస్తూ పూర్ణేశ్ ఈశ్వర్భాయ్ మోదీతో పాటు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. జస్టిస్ బీఆర్ గవాయి, ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఆ కేసులో మళ్లీ ఆగస్టు 4వ తేదీన విచారణ ఉంటుందని సుప్రీం తెలిపింది. రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు సూచించింది.
జస్టిస్ గవాయి ఈ కేసు విచారణ నుంచి తప్పుకోవాలని భావించారు. తన తండ్రి, సోదరుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని, కావాలంటే తాను ఈ కేసు నుంచి తప్పుకుంటానని, దీనిపై మీరు ఎటువంటి నిర్ణయాన్ని అయినా తీసుకోవచ్చు అని జస్టిస్ గవాయి తెలిపారు. అయితే ఈ కేసులో విచారణ చేపట్టేందుకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని న్యాయవాది సింఘ్వీ తెలిపారు. ఆ తర్వాత బెంచ్ నోటీసులు జారీ చేసింది.
రాహుల్ గాంధీ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మనూ సింఘ్వీ వాదిస్తున్నారు. రాహుల్‌కు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆయన తన పిటీషన్లో కోరారు. 111 రోజుల నుంచి మా పిటీషనర్ వేదనకు గురవుతున్నాడని, ఇప్పటికే ఓ పార్లమెంట్ సెషన్ కోల్పోయారని, ఇప్పుడు మరో సెషన్‌ను కూడా మిస్ అవుతున్నారని న్యాయవాది తెలిపారు. వయనాడ్ నియోజకవర్గానికి త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తారని, అయితే అనర్హత వేటును రద్దు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని సింఘ్వీ కోరారు.
అయితే ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న పూర్ణేశ్ మోదీ, గుజరాత్ సర్కార్ నుంచి వాదనలు వినాల్సి ఉందని కోర్టు తెలిపింది. స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పు వంద పేజీలు ఉందని, దాన్ని స్టడీ చేసేందుకు సమయం పడుతుందని సుప్రీం తెలిపింది. 2019 ఎన్నికల ర్యాలీలో కర్నాటకలోని కొలార్‌లో రాహుల్ మాట్లాడుతూ మోదీ ఇంటిపేరుపై వ్యాఖ్యలు చేశారు. ఆ కేసులో ఈ ఏడాది మార్చి 23వ తేదీన సూరత్ మెజిస్ట్రేట్ కోర్టు రాహుల్‌పై అనర్హత వేటు ప్రకటించింది. దీంతో ఆయన తన పార్లమెంట్ అభ్యర్ధిత్వాన్ని కోల్పోయారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

