Supreme court | సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. ఇక సోమవారమే కేజ్రీ పిటిషన్‌పై విచారణ..!
Supreme court | సుప్రీంకోర్టులో బుధవారం ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్‌కు చుక్కెదురైంది. కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ అర్వింద్ కేజ్రీవాల్ ఇటీవల ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మంగళవారం తీర్పు వెలువరించింది. కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేయడం సబబేనని వ్యాఖ్యానించింది. లిక్కర్ పాలసీ ద్వారా కేజ్రీవాల్ లబ్ధిపొందడానికి ప్రయత్నించినట్లు తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని పేర్కొంది.
Supreme court : సుప్రీంకోర్టులో బుధవారం ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్‌కు చుక్కెదురైంది. కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ అర్వింద్ కేజ్రీవాల్ ఇటీవల ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మంగళవారం తీర్పు వెలువరించింది. కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేయడం సబబేనని వ్యాఖ్యానించింది. లిక్కర్ పాలసీ ద్వారా కేజ్రీవాల్ లబ్ధిపొందడానికి ప్రయత్నించినట్లు తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని పేర్కొంది.
దాంతో ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేజ్రీవాల్ తరఫున ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. తమ పిటిషన్‌ను అత్యవసర విచారణకు స్వీకరించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ను సింఘ్వి కోరారు. కానీ కేజ్రీవాల్ పిటిషన్‌పై అత్యవసర విచారణకు సీజేఐ నిరాకరించారు. ‘ఆ పిటిషన్ సంగతి తర్వాత చూస్తాం’ అని వ్యాఖ్యానించారు. దాంతో తన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ కోసం కేజ్రీవాల్ ఈ వారాంతం వరకు వేచిచూడక తప్పని పరిస్థితి ఏర్పడింది.
కాగా, మంగళవారం ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించగానే ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మంత్రి సౌరవ్ భరద్వాజ్ మీడియాతో మాట్లాడుతూ.. మద్యం పాలసీ కేసు కేజ్రీవాల్‌ను, ఆయన పార్టీని అణచివేసేందుకు జరిగిన ఒక పెద్ద రాజకీయ కుట్ర అని ఆరోపించారు. హైకోర్టు తీర్పు తమకు ఆమోదయోగ్యంగా లేదని, దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తామని తెలిపారు. మద్యం పాలసీ కేసుల్లో దర్యాప్తు చేస్తున్న ఈడీ, సీబీఐ ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా అక్రమ సొమ్మును రికవరీ చేయలేదన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణి కన్నీళ్లు.. అమన్, ముఖేష్‌లకు నాగార్జున గట్టి క్లాస్,త్రిగుణ్‌కు షాక్!
Deeksha Divas | నేడు చలో కరీంనగర్.. అల్గునూరులో మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభం
Caste Census | కులగణనపై అనుమానాలెన్నో.. దేశవ్యాప్తంగా నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితి
Evening Court | ఈవెనింగ్ కోర్టులు వద్దు.. హైకోర్టు యాక్టింగ్ సీజేకి బార్ అసోసియేషన్ల సమాఖ్య వినతి
RTC Merger | అటకెక్కిన ఆర్టీసీ విలీనం.. మూడేండ్లు కావొస్తున్నా నెరవేరని హామీ!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

