ముస్లిం యువతుల పెళ్లి విషయంలో పిటిషన్.. విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు
Muslim girl Marriage | ముస్లిం యువతుల పెళ్లి విషయానికి సంబంధించి బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ వేసిన పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ముస్లిం యువతి 15 సంవత్సరాల తర్వాత తనకు నచ్చిన వెళ్లికి పెళ్లి చేసుకోవచ్చని పంజాబ్, హర్యానా హైకోర్టు
Muslim Girls | ముస్లిం యువతుల పెళ్లి విషయానికి సంబంధించి బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ వేసిన పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ముస్లిం యువతి 15 సంవత్సరాల తర్వాత తనకు నచ్చిన వెళ్లికి పెళ్లి చేసుకోవచ్చని పంజాబ్, హర్యానా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ వ్యవహారంలో హర్యానా ప్రభుత్వంతో పాటు పలువురికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 15 ఏళ్ల వయసున్న ముస్లిం యువతి వ్యక్తిగత చట్టం ప్రకారం చట్టబద్ధమైన, చెల్లుబాటయ్యే వివాహం చేసుకోవచ్చని హైకోర్టు ఇచ్చిన తీర్పును మరే ఇతర కేసులోనూ ఉదాహరణగా తీసుకోద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
వాస్తవానికి ముస్లిం పర్సనల్ లా ప్రకారం.. ముస్లిం యువతి 15 ఏళ్లు నిండిన తర్వాత చట్టబద్ధంగా వివాహం చేసుకోవచ్చని హైకోర్టు తీర్పు చెప్పింది. పిటిషన్‌పై విచారణ సందర్భంగా ‘రిట్ పిటిషన్లను పరిశీలించేందుకు అంగీకరిస్తున్నాం’ అని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. కోర్టుకు సహాయం చేయడానికి ఈ కేసులో సీనియర్ న్యాయవాది రాజశేఖర్ రావును అమికస్ క్యూరీగా నియమించింది. తదుపరి ఉత్తర్వులు పెండింగ్‌లో ఉన్నందున.. హైకోర్టు నిర్ణయాన్ని ఇతర కేసుల్లో ఉదాహరణగా పరిగణించొద్దని కోర్టు పేర్కొంది. 14, 15, 16 ఏళ్ల ముస్లిం యువతులకు పెళ్లిళ్లు జరుగుతున్నాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. ఈ పరిస్థితుల్లో శిక్షార్హమైన నేరాన్ని ముస్లిం వ్యక్తిగత చట్టం ద్వారా రక్షించవచ్చా? అని కోర్టు ప్రశ్నించింది.
ఇదిలా ఉండగా.. పంచకులలోని చిల్డ్రన్స్ హోమ్‌లో తన 16 ఏళ్ల భార్యను నిర్బంధించడంపై 26 ఏళ్ల యువకుడు దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఒకరినొకరు ఇష్టపడిన ముస్లిం యువతి, యువకుడు గతేడాది పెళ్లి చేసుకున్నారు. ముస్లిం పర్సనల్ లా ప్రకారం తమకు వివాహ వయసు ఉందని, తమకు రక్షణ కల్పించాలని కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో వారికి పంజాబ్, హర్యానా హైకోర్టు రక్షణ కల్పించింది. ముస్లిం ఆచారాల ప్రకారం తమ వివాహం సరైనదేనని, తమకు రక్షణ కల్పించాలని కోరుతూ జంట దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టును ఆశ్రయించింది. అయితే, బాల్య వివాహాల చట్ట 2006 సెక్షన్ 12 ప్రకారం అలాంటి వివాహాలు చెల్లుబాటుకావు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

