Lakhimpur Kheri violence: లఖింపుర్ ఖేరి హింస.. ఆశిష్ మిశ్రాకు సుప్రీం బెయిల్
Lakhimpur Kheri violence: మాజీ కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. లఖింపుర్ ఖేరి కేసులో ఆయనకు బెయిల్ మంజూరీ చేశారు. రైతులపై వాహనం దూసుకెళ్లిన ఘటనలో కేసు నమోదైన విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు .. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరీ చేసింది. 2021లో జరిగిన లఖింపుర్ ఖేరి కేసు(Lakhimpur Kheri violence)లో ఆశిష్‌కు బెయిల్ జారీ చేశారు. ఆశిష్ మిశ్రా వాహనం దూసుకెళ్లిన ఘటనలో 8 మంది మృతిచెందిన విసయం తెలిసిందే. అయితే ఆశిష్ మిశ్రా.. ఢిల్లీ లేదా లక్నోలోనే ఉండాలంటూ కోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. గత ఏడాది జనవరి 25వ తేదీన.. సుప్రీంకోర్టు ఆశిష్ మిశ్రాకు మధ్యంతర బెయిల్ మంజూరీ చేసింది. లఖింపుర్ ఖేరి కేసులో విచారణ చేపడుతున్న ట్రయల్ కోర్టు వేగంగా వాదనలను పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఓ టైం షెడ్యూల్ ప్రకారం ఆ కేసును పూర్తి చేయాలని సుప్రీం సూచించింది.
జస్టిస్ సూర్య కాంత్, ఉజ్వల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం .. బెయిల్ మంజూరీ చేసింది. ఈ కేసులో రైతులకు కూడా ధర్మాసనం బెయిల్ ఇచ్చింది. ఈ కేసులో ఇప్పటి వరకు 117 మంది సాక్ష్యుల్లో కేవలం ఏడు మందిని మాత్రమే విచారించారని, ఈ కేసును వేగవంతంగా విచారణ చేపట్టాలని కోర్టు తెలిపింది. యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటనను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. ఆ సమయంలో ఓ వాహనం రైతుల మీదకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆవేశంలో రైతులు కూడా అటాక్ చేశారు. ఆ దాడిలో వాహన డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు బీజేపీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. అక్కడ జరిగిన హింసలో ఓ జర్నలిస్టు కూడా ప్రాణాలు కోల్పోయాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

