Supreme Court: సుప్రీంకోర్టుకు కొత్తగా ఇద్దరు జడ్జీల నియామకం.. 34కి చేరిన జడ్జీల సంఖ్య
Supreme Court: సుప్రీంకోర్టుకు ఇద్దరు కొత్త జడ్జీలు వచ్చేశారు. జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్, జస్టిస్ ఆర్ మహాదేవన్‌లు .. సుప్రీంకోర్టు జడ్జీలుగా నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆ జడ్జీల నియామకానికి క్లియరెన్స్ ఇచ్చారు. దీంతో సుప్రీం లో జడ్జీల సంఖ్య 34కు చేరింది.
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు(Supreme Court)కు ఇద్దరు కొత్త జడ్జీలు వచ్చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆ జడ్జీల నియామకానికి క్లియరెన్స్ ఇచ్చారు. జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్, జస్టిస్ ఆర్ మహాదేవన్‌లు .. సుప్రీంకోర్టు జడ్జీలుగా నియమితులయ్యారు. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్.. ఆ జడ్జీ నియామకం గురించి ప్రకటన చేశారు. ఈ ఇద్దరు జడ్జీలకు పదోన్నతులు కల్పించాలని ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం ప్రతిపాదనలు చేసింది. ఈ కొత్త నియామకాలతో సుప్రీంకోర్టు జడ్జీల సామర్థ్యం 34కు చేరుకున్నది.
జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్.. సుప్రీంకోర్టులో చేరిన మణిపూర్‌కు చెందిన తొలి జడ్జీగా రికార్డు క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఆయన జమ్మూకశ్మీర్, లడాఖ్ .. చీఫ్ జస్టిస్‌గా ఉన్నారు. మణిపూర్‌కు తొలి అడ్వకేట్ జనరల్‌గా చేసిన ఎన్ ఇబోటోంబి సింగ్ కుమారుడే జస్టిస్ కోటీశ్వర్ సింగ్. కిరోరి మాల్ కాలేజీ, ఢిల్లీ వర్సిటీ క్యాంపస్ లా సెంటర్లో ఆయన చదివారు. 1986లో అడ్వకేట్‌గా ఆయన కెరీర్‌ను ప్రారంభించారు. జడ్జిగా మారడానికి ముందు ఆయన మణిపూర్ అడ్వకేట్ జనరల్‌గా చేశారు. గౌహతి, మణిపూర్ హైకోర్టుల్లో చేశారాయన.
జస్టిస్ మహాదేవన్.. ప్రస్తుతం మద్రాసు హైకోర్టులో తాత్కాలిక చీఫ్ జస్టిస్‌గా చేస్తున్నారు. చెన్నైలో ఆయన జన్మించారు. మద్రాసు లా కాలేజీలో ఆయన చదివారు. లాయర్‌గా ఆయన సుమారు 9 వేల కేసులను వాదించారు. తమిళనాడు ప్రభుత్వానికి అదనపు ప్రభుత్వ ప్లీడర్‌గా చేశారు. 2013లో ఆయన మద్రాసు హైకోర్టు జడ్జీగా పదోన్నతి పొందారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ప్రతిపక్షాలు మాత్రం కదిలితే హౌస్ అరెస్ట్.. రేవంత్ మరి ఈ పిల్లల బాధలు పట్టిలేదా..? : హరీశ్ రావు
Hatah | కిరణ్ అబ్బవరం ‘హతః’ విడుదల వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Union Cabinet | అగ్నివీర్లకు కేంద్ర సర్కారు గుడ్ న్యూస్.. పదవీకాలం రెండేళ్లు పొడిగించాలని క్యాబినెట్ నిర్ణయం..!
Dhinidhi Desinghu | యూత్ ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన ధినిధి దేశింగు
Rajasthan | భారత్, పాకిస్థాన్ సరిహద్దులో రైల్వేట్రాక్‌పై భారీ పేలుడు.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేత..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

