Miss-Kumari | మహిళల పేరుకు ముందుకు మిస్, కుమారి, మిసెస్ వంటి పిఫిక్స్ తప్పనిసరిగా రాయాలని అడగడవద్దంటూ సుప్రీంకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు కొట్టివేసింది. కేవలం పబ్లిసిటీ కోసమేనని పిటిషన్ దాఖలు చేశారని మండిపడింది. ప్రిఫిక్స్ను ఉపయోగించాలా? వద్దా ? అనే వ్యక్తి ఎంపికపై ఆధారపడి ఉంటుందని, ఈ విషయంలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ అమానుల్లా ధర్మాసనం స్పష్టం చేసింది.
ఈ పిటిషన్ ఏంటీ..? ఏం ఉపశమనం కోరుతున్నారు ? ప్రశ్నించింది. ఇదంతా పబ్లిసిటీ కోసమేనని, ప్రిఫిక్స్ను ఉపయోగించాలా? వద్దా ? అనే వ్యక్తికి సంబంధించిందని సుప్రీంకోర్టు పేర్కొంది. ‘ఏ మహిళ తన పేరు ముందు ‘మిస్’, ‘కుమారి’, ‘మిసెస్’ అని రాయమని అడగకూడదని మీరు అంటున్నారు. ఎవరైనా ప్రిఫిక్స్ ఉపయోగించాలనుకుంటే.. ఆ వ్యక్తి దాన్ని ఉపయోగించకుండా ఎలా ఆపగలరు’ అంటూ కోర్టు ప్రశ్నించింది. ఈ విషయంలో ఉత్తర్వులు జారీ చేయడం కుదరదని, ఈ మేరకు పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు తెలిపింది.