Supreme Court | అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్.. విచారణ జరిపిన సుప్రీం..
Supreme Court | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఇరువర్గాల వాదనలను విన్న కోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకుండా నిలిపివేసింది.
Supreme Court | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఇరువర్గాల వాదనలను విన్న కోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకుండా నిలిపివేసింది. గురువారం, లేదంటే వచ్చేవారం కేజ్రీవాల్ పిటిషన్‌పై తీర్పును వెలువరించే అవకాశం ఉన్నది. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తే.. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పరిగణలోకి తీసుకుంటామని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం ఇటీవల విచారణ సమయంలో తెలిపింది.
అయితే, విచారణ సందర్భంగా కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. సీఎంకి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని.. ఆయన అరెస్టు చట్టవిరుద్ధమని సింఘ్వీ తెలిపారు. ఈడీ ఎదుట విచారణకు హాజరుకాకపోవడం అరెస్టు ఆధారం కాదన్నారు. మధ్యంతర బెయిల్ వచ్చిన సమయంలో ప్రభుత్వ పనుల జోలికి వెళ్లొద్దని కోర్టు కోరుతుందని.. మధ్యంతర బెయిల్ ఇస్తే ప్రభుత్వ పనులతో పాటు.. ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన ఫైల్స్ జోలికి వెళ్లబోమని.. కోర్టుకు సంఘ్వీ హామీ ఇచ్చారు.
కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్‌ను ఈడీ వ్యతిరేకించింది. నేతల కోసం ప్రత్యేకంగా కేటగిరిని తీసుకురాలేమని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో ఎంపీలకు సంబంధించి దాదాపు 5వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. కేజ్రీవాల్ విచారణకు సహకరిస్తే అరెస్టు చేసేవారు కాదని.. తొమ్మిదిసార్లు సమన్లను జారీ చేసినా పట్టించుకోలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. 2022లో గోవా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ 7స్టార్ గ్రాండ్ హయత్ హోటల్లో బస చేశారని, హోటల్ బిల్లును చన్‌ప్రీత్ సింగ్ చెల్లించారని కేసు విచారణ సందర్భంగా ఈడీ కోర్టుకు తెలిపింది.
గోవా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల ప్రచారానికి నిధులు అందజేసినట్లు చన్‌ప్రీత్ సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈడీ తరపు న్యాయవాది అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్‌ను వ్యతిరేకిస్తూ.. ఇది రాజకీయ ప్రేరేపిత కేసు కాదని.. ఈ కేసులో జరుగుతున్న రాజకీయాల గురించి మాకు ఆందోళన లేదన్నారు. కానీ తమ ఆందోళన సాక్ష్యాల గురించేనన్నారు. ప్రారంభంలో తమ దృష్టి అరవింద్ కేజ్రీవాల్‌పై, ఆయనపై చర్యలు తీసుకోవాలనే ఆలోచన లేదని.. దర్యాప్తు పురోగతి సాధించిన సమయంలో ఆయన పాత్ర స్పష్టమైందని ఈడీ వివరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

