Supreme Court | భారత్ ధర్మశాల కాదు..! శరణార్థి పిటిషన్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
Supreme Court | భారతదేశం ధర్మశాల కాదని.. వివిధ దేశాల నుంచి వచ్చే శరణార్థులందరికీ ఆతిథ్యం ఇవ్వడం కుదరదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. శ్రీలంక తమిళ శరణార్థి దాఖలు చేసిన పిటిషన్ సోమవారం సుప్రీంకోర్టు తిరస్కరించింది.
Supreme Court | భారతదేశం ధర్మశాల కాదని.. వివిధ దేశాల నుంచి వచ్చే శరణార్థులందరికీ ఆతిథ్యం ఇవ్వడం కుదరదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. శ్రీలంక తమిళ శరణార్థి దాఖలు చేసిన పిటిషన్ సోమవారం సుప్రీంకోర్టు తిరస్కరించింది. శ్రీలంక తమిళ జాతీయుడి నిర్బంధంలో విషయంలో జోక్యం చేసుకోవడానికి సర్వోన్నత న్యాయస్థానం జస్టిస్ కే వినోద్ చంద్రన్‌తో కూడిన ధర్మాసనం నిరాకరించింది. పిటిషన్‌పై వాదనల సందర్భంగా ‘భారతదేశం ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు ఆతిథ్యం ఇవ్వగలదా? మేము 140 కోట్ల మందితో ఇబ్బంది పడుతున్నాం. ఇది అన్ని దేశాల నుంచి వచ్చే విదేశీ పౌరులకు ఆతిథ్యం ఇచ్చేందుకు ధర్మశాల కాదు’ అని జస్టిస్ దీపాంకర్ దత్తా అభిప్రాయపడ్డారు.
యూఏపీఏ కేసులో విధించిన ఏడు సంవత్సరాల జైలు శిక్ష ముగిసిన వెంటనే పిటిషనర్ వెంటనే భారతదేశం విడిచి వెళ్లాలని ఆదేశించిన మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. పిటిషనర్ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ శ్రీలంక తమిళుడని, వీసాపై ఇక్కడికి వచ్చాడని తెలిపారు. స్వదేశంలో తన ప్రాణానికి ముప్పు ఉందని ధర్మాసనానికి చెప్పారు. పిటిషనర్ దాదాపు మూడు సంవత్సరాలుగా నిర్బంధంలో ఉన్నారని తెలిపారు. పిటిషనర్ ఓ శరణార్థి అని.. తని భార్య, పిల్లలు ఇక్కడ భారత్‌లోనే స్థిరపడ్డారని న్యాయవాది తెలిపారు. పిటిషనర్ భార్య పలు ఆరోగ్య సమస్యలు, కుమారుడు పుట్టుకతోనే గుండె జబ్బులతో బాధపడుతున్నారని పేర్కొన్నారు.
అయితే, జస్టిస్ దత్తా పిటిషనర్ భారతదేశంలో నివసించేందుకు ఉన్న చట్టబద్ధమైన హక్కు ఏంటని ప్రశ్నించారు. ఆర్టికల్ 19 కింద స్థిరపడే హక్కు భారత పౌరులకు మాత్రమే వర్తిస్తుందని, తగిన చట్టపరమైన ప్రక్రియను అనుసరించినందున ఆర్టికల్ 21 ఉల్లంఘన జరగలేదని జస్టిస్ దత్తా పేర్కొన్నారు. పిటిషనర్ తన దేశంలో ప్రాణాలకు ముప్పు ఎదుర్కొంటున్నారని న్యాయవాది తెలుపగా.. ‘వేరే దేశానికి వెళ్లండి’ అని జస్టిస్ దత్తా వ్యాఖ్యానించారు. ఇటీవల రోహింగ్యా శరణార్థులకు సంబంధించిన కేసులోనూ జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. 2015లో పిటిషనర్‌తో పాటు మరో ఇద్దరిని ఎల్టీటీఈకి చెందిన వ్యక్తులుగా భావించి తమిళనాడు క్యూ బ్రాంచ్ అరెస్ట్ చేసింది.
2018లో ఉపా సెక్షన్ 10 కింద ట్రయల్ కోర్టు పిటిషనర్‌ను దోషిగా నిర్దారిస్తూ పదేళ్ల జైలు శిక్ష విధించింది. 2022లో మద్రాస్ హైకోర్టు అతని శిక్షను 7 సంవత్సరాలకు తగ్గించింది. అయితే, శిక్ష తర్వాత పిటిషనర్ వెంటనే భారతదేశం విడిచి వెళ్లాలని, అప్పటి వరకు శరణార్థి శిబిరంలోనే ఉండాలని ఆదేశించింది. 2009లో ఎల్టీటీఈ మాజీ సభ్యుడిగా శ్రీలంక యుద్ధంలో పోరాడినందున, తనను శ్రీలంకలో బ్లాక్ గెజిటెడ్‌గా ఉంచారని పిటిషనర్ తెలిపారు. మళ్లీ తనను శ్రీలంక పంపితే అరెస్టుతో పాటు హింసను ఎదుర్కోవాల్సి వస్తుందని పిటిషనర్ పేర్కొన్నారు. పిటిషనర్ తరపున ఆర్ సుధాకరన్, ఎస్ ప్రభు రామసుబ్రమణియన్, వైరవన్ వాదనలు వినిపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణి కన్నీళ్లు.. అమన్, ముఖేష్‌లకు నాగార్జున గట్టి క్లాస్,త్రిగుణ్‌కు షాక్!
Deeksha Divas | నేడు చలో కరీంనగర్.. అల్గునూరులో మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభం
Caste Census | కులగణనపై అనుమానాలెన్నో.. దేశవ్యాప్తంగా నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితి
Evening Court | ఈవెనింగ్ కోర్టులు వద్దు.. హైకోర్టు యాక్టింగ్ సీజేకి బార్ అసోసియేషన్ల సమాఖ్య వినతి
RTC Merger | అటకెక్కిన ఆర్టీసీ విలీనం.. మూడేండ్లు కావొస్తున్నా నెరవేరని హామీ!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

