‘ఫామ్ 6’పై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు
కొత్త ఓటర్ల నమోదుకు సంబంధించిన కొత్త ‘ఫామ్ 6’ డిక్లరేషన్‌ను తాము ఆమోదించలేదని లేదా తిరస్కరించలేదని, అలాగే దాని చెల్లుబాటుపై ఇంకా నిర్ణయం తీసుకోవలసి ఉందని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. 2026 మే నాటి సర్ తీర్పు వెలువడిన సమయంలో కొత్త ఫామ్ 6 అందుబాటులో లేనందున దానిని ఆ తీర్పులో పరిశీలించలేదని చెప్పడమే ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యల ఉద్దేశమని న్యాయస్థానం పేర్కొంది.
- సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, అక్టోబర్ 12: కొత్త ఓటర్ల నమోదుకు సంబంధించిన కొత్త ‘ఫామ్ 6’ డిక్లరేషన్‌ను తాము ఆమోదించలేదని లేదా తిరస్కరించలేదని, అలాగే దాని చెల్లుబాటుపై ఇంకా నిర్ణయం తీసుకోవలసి ఉందని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. 2026 మే నాటి సర్ తీర్పు వెలువడిన సమయంలో కొత్త ఫామ్ 6 అందుబాటులో లేనందున దానిని ఆ తీర్పులో పరిశీలించలేదని చెప్పడమే ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యల ఉద్దేశమని న్యాయస్థానం పేర్కొంది. భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వీ మోహనలతో కూడిన ధర్మాసనం భారత ఎన్నికల సంఘానికి(ఈసీఐ) ప్రియా మిశ్రా అనే వ్యక్తి దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. కొత్త ‘ఫామ్ 6’ను సుప్రీంకోర్టు సమర్థించిందన్న ఈసీఐ వాదనను ప్రధాన న్యాయమూర్తి గత వారం తోసిపుచ్చారని పిటిషనర్ తరఫు న్యాయవాది నరేంద్ర మిశ్రా పేర్కొన్నారు. దీనికి జస్టిస్ బాగ్చీ స్పందిస్తూ కొత్త ‘ఫామ్ 6’పై ఎటువంటి నిర్ణయం జరగలేదు అని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

