Supreme Court: రేప్ బాధితురాలికి ఊరట.. అబార్షన్‌కు సుప్రీం అనుమతి
Supreme Court: రేప్‌కు గురైన ఓ మహిళ .. గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించింది. కానీ కోర్టు ఆమె అభ్యర్థనను తిరస్కరించింది. అయితే ఆ బాధితురాలు సుప్రీంలో పిటీషన్ వేసింది. అత్యున్నత న్యాయస్థానం తన తీర్పులో ఆ మహిళకు ఊరట కల్పించింది. గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతి ఇచ్చింది.
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు(Supreme Court) ఇవాళ సంచలన తీర్పును వెలువరించింది. గర్భవతి అయిన ఓ అత్యాచార బాధితురాలికి ఊరట కల్పించింది. ప్రెగ్నెన్సీని తొలగించుకునేందుకు సుప్రీంకోర్టు ఆమెకు అనుమతి ఇచ్చింది. భారతీయ సమాజంలో వివాహ వ్యవస్థకు ప్రత్యేక స్థానం ఉందని, గర్భాన్ని దాల్చడం దంపతులకు సంతోషకరమైన అంశమని, సమాజానికి కూడా అది మంచి సంకేతాన్ని ఇస్తుందని, కానీ వివాహం కాని వారు గర్భాన్ని దాల్చడం వల్ల అది ఆ మహిళ మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని కోర్టు తన తీర్పులో తెలిపింది.
ఈ కేసులో ఆగస్టు 20లోగా వైద్య నివేదిక ఇవ్వాలని గత విచారణలో సుప్రీంకోర్టు పేర్కొన్నది. గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతి నిరాకరించిన గుజరాత్ హైకోర్టు తీర్పును కూడా సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఇలాంటి కేసుల్లో కొంత వేగాన్ని చూపాలని సుప్రీం అభిప్రాయపడింది. నిర్లక్ష్యపూరిత వైఖరి సరికాదు అని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది.
గర్భాన్ని తీసివేసేందుకు అనుమతి ఇవ్వాలని అత్యాచార బాధితురాలు పెట్టుకున్న పిటిషన్‌ను తొలుత గుజరాత్ హైకోర్టు కొట్టివేసింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. అసలు గుజరాత్ హైకోర్టులో ఏం జరుగుతోందని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. సుపీరియర్ కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా దేశంలోని దిగువ కోర్టులు ఆదేశాలు ఇవ్వడం సరికాదు అని సుప్రీం పేర్కొన్నది. ఇది రాజ్యాంగ వ్యతిరేకమని కోర్టు తెలిపింది. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసులో తీర్పునిచ్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

