Sunny Leone | సన్నీ లియోన్ దంపతులకు ముంబై కోర్టులో ఊరట..!
Sunny Leone | బాలీవుడ్ నటి (Bollywood Actress) సన్నీ లియోన్ (Sunny Leone), ఆమె భర్త డేనియల్ వెబర్ (Danial Weber) లకు ముంబై సెషన్స్ కోర్టు (Mumbai Sessions Court) లో భారీ ఊరట లభించింది. వారిపై నమోదైన చీటింగ్ (Cheating), క్రిమినల్ (Criminal), నమ్మకద్రోహం కేసును కోర్టు కొట్టివేసింది.
Sunny Leone : బాలీవుడ్ నటి (Bollywood Actress) సన్నీ లియోన్ (Sunny Leone), ఆమె భర్త డేనియల్ వెబర్ (Danial Weber) లకు ముంబై సెషన్స్ కోర్టు (Mumbai Sessions Court) లో భారీ ఊరట లభించింది. వారిపై నమోదైన చీటింగ్ (Cheating), క్రిమినల్ (Criminal), నమ్మకద్రోహం కేసును కోర్టు కొట్టివేసింది. ఒక తెలుగు సినిమా ఆఫర్ విషయంలో రూ.1.75 కోట్ల లావాదేవీకి సంబంధించి, తనకు రావలసిన రూ.70 లక్షలకు పైగా కమీషన్ బకాయిలు చెల్లించకుండా మోసం చేశారంటూ టాలెంట్ కోఆర్డినేటర్ ఓం ప్రకాశ్ జైన్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ కీలక తీర్పును వెలువరించింది.
గతంలో ఇదే అంశంపై జైన్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించగా 2024 అక్టోబర్లో ఆ ఫిర్యాదును మేజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది. దానిని సవాలు చేస్తూ ఆయన దిండోషి అదనపు సెషన్స్ కోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే కేసు విచారణలో భాగంగా పన్ను ఇన్వాయిస్లు, ఇతర పత్రాలను పరిశీలించిన అదనపు సెషన్స్ జడ్జి పీఏ సానే.. ఈ వ్యవహారం కేవలం రెండు పక్షాల మధ్య జరిగిన వాణిజ్య లావాదేవీల ఒప్పందానికి సంబంధించినది మాత్రమేనని స్పష్టంచేశారు.
ఒప్పందం ప్రకారం చెల్లింపులు జరగకపోవడం లేదా ఆర్థిక వివాదాలు తలెత్తడం వ్యాపారపరమైన ఉల్లంఘన మాత్రమే అవుతుందని, దానికి క్రిమినల్ నేరం (మోసం లేదా నమ్మకద్రోహం) రంగు పులమలేమని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. మొదటి నుంచే మోసం చేసే దురుద్దేశం ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు ఉంటేనే దానిని క్రిమినల్ కేసుగా పరిగణించవచ్చని పేర్కొంటూ ఓం ప్రకాశ్ జైన్ పిటిషన్ను కొట్టేస్తూ సన్నీ లియోన్ దంపతులను నిర్దోషులుగా ప్రకటించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

